3819) సంబరం సంబరం లోకమంతా సంబరం


** TELUGU LYRICS **

సంబరం సంబరం లోకమంతా సంబరం 
సంబరం సంబరం క్రిస్మస్ వెలుగులతో సంబరం 
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు శ్రీయేసుడు 
పాపులకు రక్షణ రోగులకు స్వస్థత దయచేయుటకు 
పరలోకం విడచినాడు పశువుల పాకలో జన్మించాడు 
పరమాత్ముని మరచినాడు పసిబాలునిగా మారినాడు 
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ 

గాబ్రియేలు దేవదూత వార్తను విని 
గొల్లలంతా రక్షకుని చేరుకున్నారు 
తూర్పు దిక్కు వెలసిన తారను చూచి 
జ్ఞానులెల్ల రారాజుని పూజించారు (2)
మందలను విడచినారు 
మదిలో యేసుని చేర్చుకున్నారు 
బహుమతులు ఇచ్చినారు 
ప్రవచనాలను నెరవేర్చారు 
రండి రండి రక్షకుని చూసొద్దాం 
రక్షణానందాన్ని పండుకొని తిరిగొద్దాం (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ 

చీకటిలో ఉన్న తన జనులందరిని 
ఆశ్చర్యకరమైన వెలుగులోనికి 
పాపములో ఉన్న తనప్రజలందరిని 
పరలోక రాజ్యంలో చేర్చడానికి (2)
నిజమైన వెలుగై వచ్చినాడు 
చీకటి జీవితాలు వెలిగిస్తాడు 
పరిశుద్ధునిగా వచ్చినాడు 
పాపవిముక్తిని కలిగిస్తాడు 
రండి రండి రక్షకుని చూసొద్దాం 
రక్షణానందాన్ని పండుకొని తిరిగొద్దాం (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ 

భారముతో ఉన్న తన ప్రజలందరికి 
శాంతి సమాధానం ఇవ్వడానికి 
వ్యాధులతో ఉన్న తన జనులందరికి 
సంపూర్ణ స్వస్థత ఇవ్వడానికి (2)
పాపభారాన్ని మోయవచ్చాడు 
ప్రజలకు విశ్రాంతిని దయచేస్తాడు 
నాలుగా గొట్టబడి ఇష్టపడ్డాడు 
స్వస్థత శీఘ్రముగా దయచేస్తాడు 
రండి రండి రక్షకుని చూసొద్దాం 
రక్షణానందాన్ని పండుకొని తిరిగొద్దాం (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ 

ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నిత్యుడగు తండ్రి శ్రీయేసునకు 
ఆరాధనా ఆరాధనా ఆరాధనా సమాధానకర్త శ్రీయేసుకే (2)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------