4753) వందనాలు వందనాలు నీకే యేసయ్య శతకోటి స్తోత్రలు నీకేనయ్య

** TELUGU LYRICS **

వందనాలు వందనాలు నీకే యేసయ్య
శతకోటి స్తోత్రలు నీకేనయ్య
గడచిన కాలం ఎన్నెన్నో మేళ్లతో
తృప్తి పరిచావే నా మంచి యేసయ్యా

నలిగిపోయిన ప్రతీ సమయంలో 
కృంగిపోయిన ప్రతీ విషయంలో
చేరదీసెనే నీ ప్రేమ హస్తము 
నన్నెంతగానో ప్రేమించుచున్నది

జుంటే తేనెలా ధారాలకన్న నూ
కోరదగినదీ నీ జీవ వాక్యమే 
శ్రేష్ఠమైనదీ నీ ఉపదేశమే
నన్నెంతగానో బలపరచుచున్నది

నా పూర్ణ మనసుతో నిన్నరాదించగా 
ఓ క్రొత్త తైలంతో నా తలనంటితివే 
నీ దుడ్డు కర్రయు నీ దండమును
నన్నెంతగానో ఆదరించుచున్నది

----------------------------------------------
CREDITS : Bro. Francis
Vocals : Vaghdevi
---------------------------------------------