** TELUGU LYRICS **
పునరుత్థానుడాయెను మన యేసు భయము తొలగిపోయెను
మరణాన్ని గెలిచి ముల్లు విరిచెను మహిమ వెల్లడిచేసెను
ప్రభుయేసుకు జయం అపవాదికి లయం ఆనంద విజయోత్సవం
మరణాన్ని గెలిచి ముల్లు విరిచెను మహిమ వెల్లడిచేసెను
ప్రభుయేసుకు జయం అపవాదికి లయం ఆనంద విజయోత్సవం
క్రీస్తు మృతులనుండి లేచినందున శిక్షావిధి తొలగెను
చావును జయించినందున ఆ ప్రభువే పాపుల రక్షించగలుగును
యేసునందు ఉన్న మనము నిత్యజీవ వారసులమే
క్రీస్తు మృతులనుండి లేచినందున నిరీక్షణ కలిగెను
హింసలు భరించి నిల్చిన విజయుడే మెప్పును సాధించగలుగును
యేసునందు ఉన్న మనము ఖచ్చితంగా లేపబడుదుమే
క్రీస్తు మృతులనుండి లేచినందున విమోచన దొరికెను
నీతితో జీవించుచుండిన క్రైస్తవుడే తండ్రితో కూర్చుండగలుగును
యేసునందు ఉన్న మనము ఆయతో ఏలికలమే
--------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
--------------------------------------------------------------------------------------------