4755) నీ పాటను నే పాడనా నా చిన్ని మనసుతో నా దేవా

** TELUGU LYRICS **

నీ పాటను నే పాడనా నా చిన్ని మనసుతో నా దేవా 
నీ మాటను నే పలుకనా నా చిన్ని నోటితో నా ప్రభువా 
మనసారా నేపాడనా ఆ.. ఆ.. ఆ.. 
వేనోళ్ళతో కొనియాడనా (నా)

అతిసుందరుడవు నీవు 
పదివేలలో అతికాంక్షనీయుడవు 
అతి మనోహరమైన నీ రూపమే 
నా హృదిలో నీ జ్ఞాపిక పరవసించెను

నీ ముఖంబు తేజస్సుతో నిండియుండెను
నీ వస్త్రపు చెంగులో ప్రభావముండెను 
నీ కరములు తర్షీషు రత్నభూషితం 
నా మనసే నీ రూపులో ఆనందించెను

న్యాయాధిపతివి నీవు
అన్యాయము ఏమాత్రము దరి చేరనీ
ఈ లోక న్యాయమును తేరి చూడగా
నా కన్నులు కన్నీటిని జారవిడిచెను

---------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : David Marumula
Music & Vocals : Kjw Prem & Lillian Christopher
---------------------------------------------------------------------------