** TELUGU LYRICS **
నీవు వెళ్ళమన్న చోటుకే వెళ్ళెదనయ్యా
పలుకమన్న మాటలే పలికెదనయ్యా
నీవు కోరుకున్న రీతిగా బ్రతికెదనయ్యా (2)
నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా
నీ పాత్రగా వాడుకోవయ్యా (2)
మంటి పాత్రనయ్యా నను మలచు యేసయ్యా
మహిమతో నింపి నను వాడుకోవయా (2)
శక్తి చేత కాదు నా బలము కాదయా
నీ ఆత్మతో నడిపించు యేసయ్యా (2)
పలుకమన్న మాటలే పలికెదనయ్యా
నీవు కోరుకున్న రీతిగా బ్రతికెదనయ్యా (2)
నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా
నీ పాత్రగా వాడుకోవయ్యా (2)
మంటి పాత్రనయ్యా నను మలచు యేసయ్యా
మహిమతో నింపి నను వాడుకోవయా (2)
శక్తి చేత కాదు నా బలము కాదయా
నీ ఆత్మతో నడిపించు యేసయ్యా (2)
||జ్ఞాపకం చేసుకోవయ్యా||
నీదు వాక్కుతో నా హృదిని నింపయా
నా నోటన నీ మాట ఉంచయా (2)
నన్ను మరుగుపరచి నీవు మాట్లాడయా
నీ మాటలే బ్రతికించునేసయ్యా (2)
నీదు వాక్కుతో నా హృదిని నింపయా
నా నోటన నీ మాట ఉంచయా (2)
నన్ను మరుగుపరచి నీవు మాట్లాడయా
నీ మాటలే బ్రతికించునేసయ్యా (2)
||జ్ఞాపకం చేసుకోవయ్యా||
శ్రమలు వెంట వచ్చిన పిలుపు మరువను
నా సిలువనెత్తి నిన్ను వెంబడింతును
సమయముండగానే నీ సేవ చేతును
నీ సాక్షిగా యిల జీవింతును (2)
నా సిలువనెత్తి నిన్ను వెంబడింతును
సమయముండగానే నీ సేవ చేతును
నీ సాక్షిగా యిల జీవింతును (2)
||జ్ఞాపకం చేసుకోవయ్యా||
-----------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Joselyn, Jason, jessica
Tune & Lyrics : Joselyn Sangeetha Paul & Bro.Gunaveer Paul
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------------------------------------------------