4790) నాకు నీవే కదా ఆధారం నేనడిచెదను నీతో నిత్యం

** TELUGU LYRICS **

నాకు నీవే కదా ఆధారం 
నేనడిచెదను నీతో నిత్యం 
జాలి చూపవా నాపై జాలి చూపవా 

గాలి వానలతో నేను కలత చెందితిని
మంచి రోజులు నాకు రావనుకుంటిని 
నాపై జాలిపడిన ప్రభువా గొప్ప ధనస్సు గా వచ్చితివా

నిత్య మహిమకు నిలయుడవు నీవు    
నీదుఆత్మతో నన్ను నింపెదవు 
గుండె బరువెక్కి పోయిన వేళ నీ మాటే కదా ఆధారం 

నీవు లేకుంటే బ్రతుకలేనయ్యా
నీవు రాకుంటే నడవలేనయ్యా
మనసు ఓదార్పు నొందనివేళ నీ ప్రేమే కదా ఆధారం

--------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas. Shalemraj
Vocals & Music : Sireesha & Sandy 
--------------------------------------------------------------