3752) దైవమే గర్భవాసియై ఎన్నుకున్న ఓ తల్లివై

    

** TELUGU LYRICS **

    దైవమే గర్భవాసియై - ఎన్నుకున్న ఓ తల్లివై
    ప్రభువు మెచ్చిన మహిళవై - ఆ ప్రభువుకే కన్నతల్లివై (2)
    స్త్రీలలోనే దీవింపబడిన ఓ కన్యకా...
    నీ ధైర్యమే ప్రతి మహిళకు ఆదర్శము 
    నీ త్యాగమే ప్రతి తల్లికీ ఇల ధన్యము 
    ||దైవమే||

1.  దయాప్రాప్తురాలా నీకు శుభమని దూత చెప్పగా
    శుభవచనమేమియని మరియ మదిలో యోచించగా (2)
    దేవుని కృపనే పొందగా..
    దేవుడు తోడై యుండగా...
    పరిశుద్ధాత్ముడు రాగా..
    సర్వోన్నత శక్తి కమ్మగా..
    జన్మించువాడు పరిశుద్ధుడై దైవ తనయుడు అనబడును
    అని దూత చెప్పిన మాటలకు
    ప్రభు దాసురాలనని మరియ దైవ చితమునకు తలవంచెను
    ||దైవమే||

2.  అణుకవయే ప్రతి మహిళకు అందము అలంకారము
    స్వస్థబుద్దే ఆరోగ్యము దేవుడు మెచ్చే లక్షణము(2)
    ప్రతి మహిళ ఒక మరియగా..
    విశ్వాసులకు తల్లిగా..
    ప్రభువు మెచ్చే ఇల్లాలిగా..
    దైవ సన్నిదే నిలయముగా..
    ప్రభువు నందు పరిశుద్ధులై ప్రభు ప్రేమతో వర్ధిల్లును
    వాక్యము గైకొను ధన్యులై ప్రభు సేవలో విలసిల్లును
    ||దైవమే||

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post