3751) అంగరంగ వైభవంగా పండుగఏంటంటా ఊరు వాడ పిల్లా జల్లా సందడిఏంటంటా



** TELUGU LYRICS **

    అంగరంగ వైభవంగా పండుగఏంటంటా 
    ఊరు వాడ పిల్లా జల్లా సందడిఏంటంటా 
    ఎక్కడ చూసిన క్రిస్మస్ అంటూ సంభారమేంటంటా 
    ఏం చేస్తారో ఏం చెబుతారో చూస్తేఏంటంటా 
    చిన్నా పెద్దా తేడా లేదు 
    పేదా ధనిక భేదం లేదు 
    పండుగ పామర  తేడా లేదు 
    పల్లె పట్నం తేడా లేదు 
    భూలోకానా ప్రజలందరికీ పండుగ వచ్చింది 
    కారణం యేసు జననం (4)
    యేసు జననం జగమంతా ఉత్సవం 
    యేసు జననం ఊరంతా ఉల్లాసం (2)  
    ||చిన్నా పెద్దా తేడా లేదు||

1.  చీకటి బ్రతుకున వెలుగే వచ్చిన కారణం యేసు జననం
    పాపము నుండి విడుదల కలిగిన కారణం యేసు జననం
    మరణముపైన విజయము పొందిన కారణం యేసు జననం
    దేవుని రాజ్యం భువిపైకొచ్చిన కారణం యేసు జననం
    పరమాత్ముని స్వారూప్యమే భువిపైన నడయాడగా 
    పరలోకపు వైభోగమే భూలోకమునకొచ్చెనే  
    సంతోషమే యేసు జననం 
    సంబరమే యేసు జననం (2) 
    ||చిన్నా పెద్దా తేడా లేదు||

2.  మనిషికి దేవుడు దొరికిన కారణం యేసుజననం 
    కృపయు జీవము మనమిల పొందిన కారణం యేసుజననం 
    చెదరిన గుండెకు ధైర్యము నిండిన కారణం యేసుజననం 
    దండగ బ్రతుకున పండుగ వచ్చిన కారణం యేసుజననం 
    పరిశుద్ధుడే పసిబాలుడై చిరునవ్వులొలికించగా 
    ఆ చిత్రమే తిలకించగా పరలోకం పులకించెనే  
    సంతోషమే యేసు జననం 
    సంబరమే యేసు జననం (2)
    ||చిన్నా పెద్దా తేడా లేదు||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------