** TELUGU LYRICS **
నా యేసు నాధా ననుఁ జూడవే నా జీవనాధా నా యేసునాధ మా
నవ పాప మోచక నీ యనుగ్రహముచే నిరతంబు భువిలోన
||నా యేసు||
నవ పాప మోచక నీ యనుగ్రహముచే నిరతంబు భువిలోన
||నా యేసు||
1. వింటిని నేను నా హృదయంబు వింతఁ బొందఁగను మింటనుండి
నీవు మేదిని కరుదెంచి యెంటి నర్పించితి వొనరంగ నా కొరకు
||నా యేసు||
2. నీ యానతులను నిజముగ మీరి నే నుంటి మున్ను నా యెదను
గుందుచు నా పాపముల కొరకు నీ యొద్దఁ జేరెద నిజరక్షకుఁడ వనుచు
||నా యేసు||
3. నేను నీ నెనరు రుచి జూచితి నిది యెంతో తనరు దీనుఃడ నగు నేను
ధృడ కృతజ్ఞత ప్రేమల్ గానుపింపఁగ నీ కడకు వత్తును దేవ
||నా యేసు||
4. నే నశక్తుడను నిను సేవింప నిత్యంబు ధరను గానఁ బ్రార్థనఁ బూని
ఘనుఃడ వని నమ్ముచు నానందమున వత్తు ననిశంబు నీ దరికి
||నా యేసు||
5. దయ చేయు మయ్యా సత్యాత్మను దాసుని కిపుడు దయచేసి శుద్ధాత్మఁ
ద్వరగాఁ గల్గించుము ప్రియముగ నీ సేవ పెంపుసేయఁగ శక్తి
||నా యేసు||
6. నీవు నాతోడ నెప్పుడు నుండు నిజ మొనగూడ నీవు నాతో నుండ
నిర్భయముగ నేను ద్రోవఁ బోవుదు నీకు స్తోత్రంబు చేయుచు
||నా యేసు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------