1511) నా యేసు నా యాత్మ బలమా

** TELUGU LYRICS **

    నా యేసు! నా యాత్మ బలమా! నీదు గాయంబులే నిలువబలమైన స్థలము
    సకల సృష్టి పునాదియపుడే నాదు సకల పాపములకై బలియైతి వేసు!
    సకల భూమ్యాకాశములను సమము గా గతించినఁగాని నీ ప్రేమ
    నిలుచు 
    ||నా యేసు||

1.  నా తండ్రి! నీ నిత్య కృపను నెంచ నా తరమ? నీ ప్రేమ హస్తముల జూచి
    పాతకుల రండంచు బిలిచి వేగ నీదు కృప రుచి జీవంబు నిచ్చు 
    ||నా యేసు||

2.  దరిలేని లోతైన ప్రేమా! నీలో దురిత యెల్లను మునిఁగి పోవు
    దరిలేని యుచిత కృపఁ జాటు నీదు రక్తంబు నా పాపడాగులను గడిగె
    ||నా యేసు||

3.  ఈ ప్రేమ సాగరంబున నే దుమికి నా ప్రభుని యెదదూరి విశ్రాంతి
    నొంది యే ప్రొద్దు సంతసించెదను నన్ను నా ప్రాణమును డాయదిఁక
    నరక మొందు
    ||నా యేసు||

4.  నా శిరముపై నలలురేగి యిలను నా సత్తువయు స్నేహితులు నన్ను
    వీడి నా సుఖము నా సంతసము బోయి నను నీదు కృప నన్ను
    విడిపోదు తండ్రీ 


5.  నా హృదయమే నిలిచిపోనీ నాదు శరీరమే కుళ్ళి నీరైన గానీ ధర
    పునాదులే కరిగిపోనీ యేసు నిరతంబు నీ ప్రేమ నిలుచు నను బ్రోచు 
    ||నా యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------