4779) ఓ మనిషీ నీ ప్రయాసమెటు ఓ మనిషి నీ ప్రయాసమెటు

** TELUGU LYRICS **

ఓ మనిషీ నీ ప్రయాసమెటు ఓ మనిషి నీ ప్రయాసమెటు
ఈ లోకా సిరి సంపదకొరకా పరలోక ప్రభు ప్రయాసానికా
నిర్ణయించుకొని నిజము తెలుసుకో మనిషి
||ఓ మనిషి||

లక్షాధికారివైన లవణమన్నమేకాని 
మెరిసే బంగారాన్ని తినలేరు ఎవరు..
పట్టుపానుపు పైన పవళించినగాని 
ఆరడుగుల సమాధిని చేరనివాడెవడు
కన్నులార చూచుటయేగాని (2)
ధనమువలన తృప్తినొందలేరు ఏ నరులు
 మరణంతో ఏమి తీసుకోరు ఈ మానవులు
||ఓ మనిషి||

వ్యర్ధం వ్యర్ధం అని ప్రసంగి తెలుపుచున్నాడు 
సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంత
జ్ఞానముతో తెలివితో సంపాదించిన సంపద 
అనుభవించకుండానే విడిచి వెళ్ళుతారు 
మంచులాగ కరిగే ఈ జీవితం (2)
ఆశల వలయంలో చిక్కుకొనుట వ్యర్ధం
లోకాశలు కలిగి జీవించుట వ్యర్ధం
||ఓ మనిషి||

వ్యర్ధం కానిది ప్రయాసము ప్రభుదని
అర్ధముతో క్రియలుచేయ ప్రయాసపడుమూ
ప్రభునందు ప్రయాసము అలయక చేయుచు
స్థిరులునూ కదలనివారిగమీరుండాలి 
ప్రభునందు మృతినొందినవారే ధన్యులని (2)
మరణంతో సత్ క్రియలే వెంట వచ్చునని 
పరిశుద్ధతతో పనులే దేవుని చేర్చునని
||ఓ మనిషి||

--------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tunes : Bro.P.Srinivas 
Music & Vocals : Emmanuel Prem & Shylaja Nuthan
Youtube Link : 👉 Click Here
--------------------------------------------------------------------------------