4778) మన బలమైన దేవునికి ఆనంద గానము చేయుడి

** TELUGU LYRICS **

మన బలమైన దేవునికి 
ఆనంద గానము చేయుడి
మన యేసయ్య నామమును ఉత్సాహ గానము చేయుడి
ఎలుగెత్తి కీర్తన పాడుడి
మన యేసయ్యను స్తుతియించుడి

తంబురతోను నాట్యముతోను దేవుని స్తుతియించుడి
స్వరమండలముతో సితారతోను దేవుని స్తుతియించుడి
ఉత్సాహ స్తోత్ర గానాలతో
దినమెల్ల దేవుని స్తుతియించుడి

ఆత్మతోను సత్యముతోను దేవుని స్తుతియించుడి
పూర్ణ బలముతో శక్తితోను దేవుని స్తుతియించుడి
గంభీర స్తోత్ర గానాలతో 
మన స్తుతి సువాసనగా అర్పించుడి

ఆకాశపు వాకిళ్ళు తెరచిన 
దేవుని స్తుతియించుడి
బంధకాలు సంకెళ్లూ తెంచిన దేవుని స్తుతియించుడి
రాజులైన యాజక సమూహమా మన రాజైన క్రీస్తుని స్తుతియించుడి

---------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Neehaar Gummadi
Vocals : Rev. Dr. Daniel Jayanth Kishore
---------------------------------------------------------------------