4773) ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా నీ కృపలో

** TELUGU LYRICS **

ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా
నీ కృపలో నేనుంటే చాలు యేసు 
ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా 
నీ చేతినందిస్తే చాలు యేసు
ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా 
నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా 
ఆధారం నీవే ఆశ్రయం నీవే 
నా శక్తి నీవే నా చెలిమి నీవే 

హీనుడనని అందరు నన్ను త్రోసివేసి దూషించితిరి (2)
నీ ఎదుట మోకాళ్ళు వంచితిని నన్ను ఎందరికో దీవెనగా మార్చితివి 

ఆత్మీయతలో ఎన్నోమార్లు కక్కిన కూటికై పరుగెడితిని (2)
నీ వాక్యం ద్వారా నను గద్దించగా ఈ లోకం వ్యర్థంగా 

స్నేహితులే తోబుట్టువులే ఆత్మీయులే నన్ను హింసించి (2)
ఘోరముగా అవమానించినా నాకు రెట్టింపు ఘనతను ఇచ్చితివి

 ** ENGLISH LYRICS **

------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro. Prakash Garu
Vocals & Music : Bro.Nissi John & Daniel John
------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post