4735) యేసు నీ రక్తము నన్ను కడుగును నా అంతరంగమును శుద్ది చేయును

** TELUGU LYRICS **

యేసు నీ రక్తము నన్ను కడుగును
నా అంతరంగమును శుద్ది చేయును (2)

వధకు తేబడిన గొర్రెపిల్ల రక్తము
నా కొరకు బలియైన పరిశుద్దుని రక్తము (2)

నా చెడు క్రియలన్నిటిని సహియించితివి 
నా దోషములన్నీ భరియించితివి (2)
నీ త్యాగము చూపినది - ఆ సిలువ రక్తము
నీ ప్రేమ ప్రవహించినది - కలువరిలో రక్తము  (2)

మార్గమునే మరచి తప్పిపోతిని 
నీ ప్రేమను చూపి నను పిలచితివి (2)
నీ సన్నిధిలో నిలిపెను - ఆ సిలువ రక్తము 
నిర్దోషిగ నను మార్చేను - నా ప్రియుని రక్తము

నీతిగా నిలబెట్టేను - యేసు నీ రక్తము
నా రక్షానను స్థిరపరచెను - యేసు నీ రక్తము
నీ సాక్షిగా నను మార్చేను - యేసు నీ రక్తము
జయ జీవితము నాకిచ్చెను - యేసు నీ రక్తము

 ** ENGLISH LYRICS **

---------------------------------------------------------
CREDITS : Music : Joseph Raj Ricky
Lyrics : Sunny Santosh Kornepati
---------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post