** TELUGU LYRICS **
రాజాధిరాజు ఉదయించెనే - నిన్ను నన్ను రక్షింప జన్మించెనే
యూదుల రాజుగా జన్మించెనే - పశుల తొట్టిలో పరుండ పెట్టెనే (2)
సంతోషించి ఆరాధించుదాం - రండి సందడి చేసి ఆనందించుదాం (2)
కన్య మరియ గర్భమందున - ఇమ్మానుయేలు జన్మించనే
చీకటిలో ఉన్న మన జీవితాలకు - వెలుగును నింపుటకు ఉదయించెను (2)
సంతోషించి ఆరాధించుదాం - రండి సందడి చేసి ఆనందించుదాం (2)
దేవదూతలు వచ్చినారు - కాపరులకు శుభవార్త తెచ్చినారు
బాల యేసుని పూజించుటకు - వెళ్ళినారు యేసుని మ్రొక్కినారు (2)
సంతోషించి ఆరాధించుదాం - రండి సందడి చేసి ఆనందించుదాం (2)
బాల యేసుని పూజించుటకు - వెళ్ళినారు యేసుని మ్రొక్కినారు (2)
సంతోషించి ఆరాధించుదాం - రండి సందడి చేసి ఆనందించుదాం (2)
లోక పాప భారము నీవు మోసావు - గొప్ప రక్షణను మాకిచ్చావు
పరలోకవాసులుగా మమ్ము చేసావు - నీ కొరకు బ్రతుకుటకు మమ్ము నిలిపావు (2)
సంతోషించి ఆరాధించుదాం - రండి సందడి చేసి ఆనందించుదాం (2)
||రాజాధిరాజు||
---------------------------------------------------------
CREDITS : Music : Ashok.M
Lyrics, tune, vocal : CA.Phebe Gracy
----------------------------------------------------------