4424) నలుగకుండ గోధుములు కడుపు నింపగలుగునా


** TELUGU LYRICS **

నలుగకుండ గోధుములు - కడుపు నింపగలుగునా 
కరగకుండ కొవ్వొత్తి - కాంతి నివ్వగలుగునా 
ఆత్మీయ యాత్రలో - నలుగుటయే విలువయా 
ఇరుకైన బాటలో - కరుగుటయే వెలుగయా 

పగలని బండనుండి - జలములు ఊరునా 
విరుగని పొలము మనకు - పంటలీవ్వగలుగునా 
పరలోకయాత్రలో - పగులుటయే ఫలమయా 
విశ్వాసి బాటలో విరుగుటయే వరమయా
||నలుగ||

రక్తము చిందకుండ - పాపములు పోవునా 
కన్నీరు కార్చకుండ - కలుషములు కరుగునా 
అంతిమ యాత్రలో - క్రీస్తేసే గమ్యమయా 
ఏకాంత బాటలో - ప్రభు యేసే శరణమయా 
||నలుగ||

---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Aadharane Chaalunaya (నీ ఆదరణే చాలునయా)
---------------------------------------------------------------------------------------