4423) నీ కృపయే నన్ను కాచెను నీ దయయే నన్ను దాచెను


** TELUGU LYRICS **

నీ కృపయే నన్ను కాచెను - నీ దయయే నన్ను దాచెను 
నీ క్షమయే నన్ను ఓరెను - నీ వాక్యమే ఓదార్చెను (2) 
చాలయ్యా నీ కృప చాలునయ్యా (4)
||నీ కృపయే||

గాఢాంధకారములో - నేనుండగా 
నీ సన్నిధియే నాకు - వెలుగాయెగా 
నా శత్రువుయే నన్ను - తరుముచుండగా 
నా స్థానములో నిలిచి - పోరాడెగా 
భయభీతులలో - నేనుండగా 
అవమానములో - అల్లాడగా (2) 
నాకాపరియై - నన్ను చేరెగా 
నావైరులను - వెళ్ళెగొట్టెగా 
చాలునయ్యా - నీ కృప చాలునయ్య (4) 
||నీ కృపయే||

నావారే నన్ను - గెంటి వేయగా 
మరణభయమే - నన్ను ఆవరింపగా 
నా చెంతచేరి నన్ను - స్వస్థపరిచెగా 
నీ చేయి చాచి నన్ను - చేరదీసెగా 
అపజయమే నన్ను - కృంగదీయగా 
అంటరానిదాననని - గేళిచేయగా (2) 
నా పక్షమున చేరి - జయమిచ్చెగా 
నాతో వుంటానని - మాటిచ్చెగా 
చాలునయ్యా - నీ కృప చాలునయ్య (4) 
||నీ కృపయే||

----------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా)
----------------------------------------------------------------------------