** TELUGU LYRICS **
మహోన్నతుడా నీ నామమునే
కీర్తించుటయే ఉత్తమము
సర్వోన్నతుడా నీ మహిమను నే
ప్రచురించుటయే భాగ్యము
ఆ... రాధన... ఆ... రాధన... (2)
||మహోన్నతుడా||
కీర్తించుటయే ఉత్తమము
సర్వోన్నతుడా నీ మహిమను నే
ప్రచురించుటయే భాగ్యము
ఆ... రాధన... ఆ... రాధన... (2)
||మహోన్నతుడా||
ఉదయమున నీ కృపను గూర్చియు
రాత్రిజామున విశ్వాస్యతను (2)
పదితంతుల స్వరమండలముతో
గంభీర ధ్వనిగల సితారతో (2)
ప్రచురించుటయే భాగ్యము
కీర్తించుటయే సౌభాగ్యము
ఆ.. రాధన... ఆ... రాధన... (2)
||యెహోవా||
మందిరావరణమున నాటబడి
నిత్యము చిగురించి వర్ధిల్లుచూ (2)
ఖర్జూర వృక్షమువలె నీ వాక్యపు నీడలో ఎదుగుచూ (2)
స్తుతియించుటయే భాగ్యము
కీర్తించుటయే సౌభాగ్యము
ఆ... రాధన... ఆ... రాధన... (2)
||యెహోవా||
----------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా)
----------------------------------------------------------------------------