4425) ప్రభువా అని ప్రార్థిస్తే చాలునా దేవా అని ఆర్థిస్తే సరిపోవునా


** TELUGU LYRICS **

ప్రభువా! అని ప్రార్థిస్తే చాలునా 
దేవా అని ఆర్థిస్తే సరిపోవునా 

మనసు మార్చుకోకుండా ప్రార్థనలు చేసినా 
బ్రతుకు బాగుపడకుండా - కన్నీళ్ళు కార్చినా 
ప్రభుని క్షమను పొందగలమా - దీవెనల నొందగలమా? 
ఆలోచించుమా ఓ నేస్తమా - ఆలోచించుమా ప్రియ సంఘమా 

పైకి భక్తి ఎంత ఉన్న - లోన శక్తి లేకున్న 
కీడు చేయు మనసు ఉన్న కుటుంబాలు కూల్చుతున్న 
సుఖ సౌఖ్యమునొందగలమా - సౌభాగ్యము పొందగలమా
ఆలోచించుమా ఓ నేస్తమా ఆలోచించుమా ప్రియ సంఘమా 

మాటతీరు మారకుండా - మనుష్యులను మార్చతరమార 
నోటినిండా బోధలున్నా గుండె నిండా పాపమున్నా 
ప్రభు రాజ్యం చేరగలమా - ఆ మహిమను చూడగలమా 
ఆలోచించుమా ఓ సేవకా! - ఆలోచించుమా ప్రియ బోధకా! 

---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Aadharane Chaalunaya (నీ ఆదరణే చాలునయా)
---------------------------------------------------------------------------------------