4426) నీ బలమును బట్టి అతిశయించెదా నా యేసయ్య


** TELUGU LYRICS **

నీ బలమును బట్టి అతిశయించెదా నా యేసయ్య 
నీ రక్షణ బట్టి నిను కీర్తించెద - నా యేసయ్య 

మోసగాళ్ళను మార్చేసినావే - స్తోత్రము స్తోత్రము 
వంచకులను వంచేసి నావే - స్తోత్రము స్తోత్రము 
కఠినమైన హృదయముగల నన్ను 
కరుణ శీలిగా - మార్చేసినావే 
||నీ బలమును|| 

పాపులెందరినో ప్రేమించినావే - స్తోత్రము స్తోత్రము 
పతితులెందరినో పరిశుద్ధపరచావే - స్తోత్రము స్తోత్రము 
ఓటమి ఓడిలో - ఒరిగిన ఎందరినో 
గెలుపు బాటలో - నడిపించినావే
||నీ బలమును|| 

చెరపట్టబడిన నన్ను విడిపించినావే - స్తోత్రము స్తోత్రము 
అద్భుతముగా నడిపించినావే - స్తోత్రము సోత్రము 
లోబడనొల్లక - విసిగించిన నన్ను 
ఓర్చుకన్న ప్రియ తండ్రివి 
||నీ బలమును|| 

---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Aadharane Chaalunaya (నీ ఆదరణే చాలునయా)
---------------------------------------------------------------------------------------