3837) నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం

    

 ** TELUGU LYRICS **   

    నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం
    నీవు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం (2)
    నను కాచావు నను దాచావు పోషించి నడిపావు 
    భలపరిచావు దృఢపరిచావు ధైర్యముతో నిలిపావు
    హల్లేలూయ ఆరాధన - హల్లేలూయ స్తుతి ఆరాధన
 (2)
      
1.  ప్రశాంతమైన జీవిత యాత్రలో అలలెన్నో రేగినా
    పెను ఉప్పెనలాంటి పరిస్థితులే కెరటాలై ఎగసిన
    చుక్కానివి నీవై నా నావికుడవు నీవై
 (2)
    ఇంత వరకు నను క్షేమముగా నడిపిన నాథుడవై
 (2)
    హల్లేలూయ ఆరాధన- హల్లేలూయ స్తుతి ఆరాధన
 (2)
  
2.  మరల తిరిగి రావూ నీవు గడిపిన దినములు
    వ్యర్థపరచబోకూ నీ విలువైన గడియలు
 (2)
    ప్రభుయేసు సాక్షిగా ఈ నూతన సంవత్సరమున
 (2)
    చేసుకో తీర్మానం అర్పించు నీ హృదయం
 (2)
    హల్లేలూయ ఆరాధన _ హల్లేలూయ స్తుతి ఆరాధన
 (2)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------