2884) రమ్యమైనది నీ మందిరము సౌందర్యమైనది నీ ఆలయము


** TELUGU LYRICS **

రమ్యమైనది నీ మందిరము 
సౌందర్యమైనది నీ ఆలయము (2) 
అద్భుతమైనది నీ (నా) పరలోకము 
బహు శ్రేష్టమైనది నీ (నా) సీయోను పురము (2) 
||రమ్యమైనది||

నా యింటివారితో - నీ సన్నిధిని చేరెదన్ 
నా పూర్ణహృదయముతో - నే నిన్ను సేవింతును (2)
నీ వాక్యముచేత - నన్ను నింపుమయ్యా 
నీ సన్నిధిలోనే - నిరతము నిలుపుమయా (2) 
||రమ్యమైనది||

నీ ఆత్మ శక్తితో - నీ సాక్షిగా సాగెదన్ 
నీ సన్నిధి కాంతిలో - నే ప్రకాశింతును (2) 
నీ కోసమే ఇలలో - నే జీవింతును 
నశియించువారిని - నీ సన్నిధికి చేర్చెదన్ (2) 
||రమ్యమైనది||

-----------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Chitthame Chalunaya (నీ చిత్తమే చాలునయా) 
-----------------------------------------------------------------------------------