2885) రవికాంతిని మించినదౌ ఒక దేశము దూరమున

** TELUGU LYRICS **

1.  రవికాంతిని మించినదౌ
    ఒక దేశము దూరమున
    వరభక్తులు చూచెదరు
    తండ్రి యాశ్రయ మిచ్చునటన్
    ||అహహా త్వరలో
    మేము చేరుదు మా స్థలమున్
    అహహా త్వరలో
    మేము చేరుదు మా స్థలమున్||

2.  దుఃఖబాధలు లేక సదా
    పూర్ణశాంతినిఁ బొందుచును
    పరిశుద్ధుల కీర్తనలు
    అందు నెప్పుడు బాడుదుము.

3.  ప్రేమ సాగరుఃడౌ జనకున్
    మాకు నిచ్చిన మేలులకై
    మా కృతజ్ఞత జూపుచును
    నిత్యమున్ స్తుతి యించెదము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------