** TELUGU LYRICS **
ప్రభువా నీ కార్యమును - నూతన పరచుము మాలో
పరిశుద్ధ దేవా నీకు - ప్రజలమై యున్నా మిలలో
పరిశుద్ధ దేవా నీకు - ప్రజలమై యున్నా మిలలో
1. సంవత్సరములు జరుగుచుండగనే సత్యదేవా
విలువైన నీదు కార్యమును - తెలియజేయుము మాకు
2. పాపము జేసి నీదు - కోపము రేపితిమయ్యా
కోపించుచునే నీదు - వాత్సల్యము జూపుమయ్యా
కోపించుచునే నీదు - వాత్సల్యము జూపుమయ్యా
3. ప్రేమతో మము రక్షించి - క్షేమము నిచ్చితివయ్యా
ప్రేమించకున్నాము మేము - ప్రేమా మయుడా నిన్ను
ప్రేమించకున్నాము మేము - ప్రేమా మయుడా నిన్ను
4. వెలిగించితివి మమ్మిలలో - వెలుగైన ఓ మా ప్రభువా
పలుచోట్ల లోన మేము - వెలుగకున్నామయ్యా
పలుచోట్ల లోన మేము - వెలుగకున్నామయ్యా
5. మారుచున్న లోకమున - కారుతొట్లలో త్రాగన్
జీవపు ఊటవు నిన్ను విడచి - త్రొవతప్పితిమయ్యా
జీవపు ఊటవు నిన్ను విడచి - త్రొవతప్పితిమయ్యా
6. సోదర ప్రేమను జూపు - మాదిరి విడచితిమయ్యా
ఓదార్పు పొందిన మేము - ఆదరణియ్యకున్నాము
ఓదార్పు పొందిన మేము - ఆదరణియ్యకున్నాము
7. మేలిమి బంగారుగను - మమ్ముల జేసితివయ్యా
మాలిన్యమునంటి మేము - మందగిలియున్నాము
మాలిన్యమునంటి మేము - మందగిలియున్నాము
8. మాటతప్పని మాదేవా - కోటగా నున్నావయ్యా
చాటించెద నీదు ప్రేమన్ - సాటిలేని ప్రియుడా
చాటించెద నీదు ప్రేమన్ - సాటిలేని ప్రియుడా
** ENGLISH LYRICS **
Prabhuva Nee Kaaryamunu - Noothana Parachumu Maalo
Parishudhdha Dhaeva Neeku - Prajalamai Unnaa Milalo
1. Samvathsaramulu Jaruguchundaganae Sathyadhaevaa
Viluvaina Needhu Kaaryamunu - Theliyajaeyumu Maaku
2. Paapamu Jaesi Needhu - Koapamu Raepithimayyaa
Koapinchuchunae Needhu - Vaathsalyamu Joopumayyaa
3. Prematho Mamu Rakshinchi - Kshaemamu Nichchithivayyaa
Preminchakunnamu Maemu - Premaa Mayudaa Ninnu
4. Veliginchithivi Mammilalo - Velugaina O Maa Prabhuvaa
Paluchoatla Loana Maemu - Velugakunnamayyaa
5. Maaruchunna Loakamuna - Kaaruthotlalo Thraagan
Jeevapu Ootavu Ninnu Vidachi - Throvathappithimayyaa
6. Sodhara Premanu Joopu - Maadhiri Vidachithimayyaa
Oadhaarpu Pondhina Maemu - Aadharaniyyakunnamu
7. Maelimi Bangaaruganu - Mammula Jaesithivayyaa
Maalinyamunanti Maemu - Mandhagiliyunnaamu
8. Maatathappani Maadhaeva - Koatagaa Nunnavayyaa
Chaatinchadha Needhu Preman - Saatilaeni Priyudaa
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------