2051) ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము

** TELUGU LYRICS **

    ప్రభువా నీ గొప్పతనము - స్తుతికి యోగ్యము
    అశక్యమైనది - వర్ణించలేమిల

1.  సృష్టి గొప్పది అద్భుతమేగా - సంకల్పమెంతో వుత్తమము
    మానవజాతి కొరకై ప్రభూ - సిద్దపరచె సమస్తము
    నీదు పనులు నీ సామర్ధ్యము వర్ణించలేమిల

2.  నీ రూపమున నరుని సృజించి - అధికారము నిచ్చితివి
    క్రీస్తునందు నిర్దోషినిగా - నిలువబెట్ట గోరితివి
    నీదు దయ నీ మంచితనము వర్ణించలేమిల

3.  సృష్టిని చేసిన శక్తికంటె - పాపికి రక్షణ గొప్పది
    నీ యొద్ద నున్న సర్వమిచ్చి - విలువగు ముత్యము కొన్నావు
    నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిల

4.  నీకు మానవుడమూల్యము - నీవు ప్రేమించుచున్నావు
    అందుకే నీ ప్రాణమర్పించి - రక్తము కార్చి రక్షించితివి
    నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిల

5.  అద్భుతమైన నూతన సృష్టి - మానవునికి నిచ్చితివి
    రాజులనుగ యాజకులుగ వారసులుగను చేసితివి
    నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిల

6.  ఉల్లాసముతో సృష్టి మైమరచే - అద్భుత కార్యములను చూచి
    సంతోషించి ఆరాధించిరి - నీవే సర్వమని చెప్పిరి
    నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిల

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------