2304) మణులు మాణిక్యములున్న మేడమిద్దెలు ఎన్నున్నా

** TELUGU LYRICS **

    మణులు మాణిక్యములున్న - మేడమిద్దెలు ఎన్నున్నా
    మదిలొ యేసు లేకున్నా - ఏది వున్నా అది సున్నా

1.  చదువులెన్నో చదివున్నా - పదవులెన్నో చేస్తున్నా
    విద్య వున్నా బుద్ది వున్నా - జ్ఞానమున్నా అది సున్నా
    ||మణులు||

2.  అందచందా లెన్నున్నా - అందలముపై కూర్చున్నా
    సుందరుడగు ప్రభు లేకున్నా - అందమున్నా అది సున్నా
    ||మణులు||

3.  రాజ్యములు రమణులున్నా - శౌర్యములు గల వీరులున్నా
    బలము వున్నా బలగమున్నా - ఎన్నియున్నా అవి సున్నా
    ||మణులు||

4.  పూజ్యుడా పుణ్యాత్ముడా - పుణ్యకార్య సిద్దుడా
    దానధర్మము తపము జపము - యేసు లేనివి అన్నీ సున్నా
    ||మణులు||

** ENGLISH LYRICS **

Manulu Maanikyamulunna - Medamidhdhelu Ennunnaa
Madhilo Yesu Lekunnaa - Edhi Vunnaa Adhi Sunnaa

1. Chadhuvulenno Chadhivunnaa - Padhavulenno Chesthunnaa
Vidhya Vunnaa Buddhi Vunnaa - Gnaanamunnaa Adhi Sunnaa
||Manulu||

2. Andhachandha Lennunnaa - Andhalamupai Koorchunnaa
Sundharudagu Prabhu Lekunnaa - Andhamunnaa Adhi Sunnaa
||Manulu||

3. Raajyamulu Ramanulunnaa - Shauryamulu Gala Veerulunnaa
Balamu Vunnaa Balagamunnaa - Enniyunnaa Avi Sunnaa
||Manulu||

4. Poojyudaa Punyaathmudaa - Punyakaarya Siddhudaa
Dhaanadharmamu Thapamu Japamu - Yesu Lenivi Annee Sunnaa
||Manulu||
-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------