2305) మద్యపాన ప్రియులు గాకుండి ప్రియులార

** TELUGU LYRICS **    

    మద్యపాన ప్రియులు గాకుండి ప్రియులార మీరా మత్తులోనే మునిఁగి
    పోకుండి మద్యపానము చేయువారికిఁ దథ్యముగఁ బ్రాప్తించుఁ గీడులు
    కొద్దియైనన్ రుచిని జూడఁగఁ గోరఁ దగ దని తలఁచుకొనుఁడి 
    ||మద్య||

1.  రక్త మంతయుఁ జెడును సుమ్మండి ప్రియులారా మీరు శక్తిహీనులగుదు
    రిల నుండి శక్యిహీనులె గాక మఱి మీ భక్తి దొలఁగి పోవునండి
    ముక్తిమార్గము దెలియదండి ముందు గతికి హీనమండి
    ||మద్య||

2.  బుద్ధిబలములు కొద్ది వౌనండి ప్రియులారా మీరు మొద్దు లగుదురనియు
    నమ్ముండి హద్దు మిరుచుఁ ద్రాగువారికిఁ గొద్దికాలమె జీవమండి
    శ్రద్ధగల్గి మద్యపానము రద్దు చేయుట తగినదండి
    ||మద్య||

3.  మచ్చునకును త్రాగఁబోకుండి ప్రియులార మీరీ తుచ్ఛమైన పనులు
    వీడుండీ హెచ్చుగాఁ దిని త్రాగువారికి వచ్చు రోగము కుదురదండి
    చచ్చుటకు నిది హేతువని మదిఁ గచ్చితముగను దెలిసికొనుఁడి
    ||మద్య||

4.  ఆలుబిడ్డల మేలుఁగోరుండి ప్రియులారా వారి మేలుఁ గోరినఁ ద్రాగంఁ
    బోకుండి మేలు లెఱింగి పిలుచు క్రీస్తుని జాలిచూపులు దెలిసికొనుఁడి
    కాలయాపనఁ జేయకుండి కర్త యేసని నమ్ముకొనఁడి
    ||మద్య||

5.  ఘన ధనములు నిలువఁబోవండి ప్రియులార నీచ తనము మీకు
    మూల మౌనండి తనవిఁదీర్చుదు మద్యమండి ఘనుల కొంపలు గూల్చు
    నండి ఘనముగాఁ బ్రభువాక్యసారము వినయమతితో ఁ గ్రోలరండి
    ||మద్య||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------