2216) బంగారు బంగారు మా తండ్రి యేసయ్య

** TELUGU LYRICS **

బంగారు బంగారు మా తండ్రి యేసయ్య
దివి నుండి దిగి వచ్చి దరణిలో వెలిసాడయ్య
ఈ వార్త శుభ వార్త అందరికి తెలిసేలా 
మనమంతా జగమంతా చాటింపు వేసేద్దామా

ఆనందం ఆర్భాటం కలిగించే ఈ తరుణం
భజియించి పూజిద్దాం తంబూర నాట్యముతో
సంతోషం సంబరం కలిగింది ఈ దినం 
భజనలు చేసేద్దామా తంతి వాయిద్యములతో...

యేసు రాజు పుట్టినాడయ్యో అన్నల్లారా
రండి మనము చూసి వద్దాము కన్నులారా
యేసు రాజు పుట్టినాడమ్మో అమ్మల్లారా
రండి మనము ఆరాధిద్దాము మనసారా  
||బంగారు||

మా రాజు పుట్టగా ఆ చుక్క వెలిసేలె 
ఆ ఙ్ఞానులకు మార్గం చూపే
మన యేసు పుట్టగా ఆకాశం మెరిసేలే
తన రాజ్యముకు మార్గం వేసే              
మా రాజు పుట్టగా ఆ దూత వచ్చేలే
ఆ గొల్లలకు వార్త తెలిపే
మన యేసు పుట్టగా ఈ ధరణి మురిసేలే
ఈ లోకముకు వార్త చాటే..
మనకోసం దిగివచ్చాడయ్యా పరమునుండి
తన రక్తం చిందించాడయ్యా
ఈ లోకం వెలిగించాడయ్యా చీకటి నుండి
మన పాపం తొలగించాడయ్యా 
చక్కనైన చిన్ని యేసు చెంత 
చేరుదాము సిద్దమా సోదరా
||యేసు రాజు||        ‌     

సృష్టి కర్త నరూపుడై వచ్చే పని ఏంటంటా
సర్వ మానవుల రక్షణార్ధమై ఇల ఉదయించేనంట
ఈ లోకానికొచ్చి తన విలువైన ప్రాణమిచ్చుడేంటంట
మన పాప ప్రతిఫలం మరణమని 
మన బదులు బలియాయెనంట
ఈ లోకాన్ని ప్రేమించి భూలోకం ఏతెంచి 
జన్మించె మెస్సయ్య వార్త చాటు సోదరా
||యేసు రాజు||    

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------