497) ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు

** TELUGU LYRICS **

    ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి
    సమర్పింతు హీనుఁడ నగు నేను గామితార్థము లెల్ల గలుగఁజేయు
    నీకు 
    ||ఏమి||

1.  నేను మార్గముఁ దప్పియుండఁగ నన్ను నీవు కంటివి కరుణ నిండఁగ
    దీనపాపులను దృఢముగఁ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము
    ||ఏమి||

2.  అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్ను
    వినతి పొందుగఁ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు
    ||ఏమి||

3.  నీ యందే యానంద మొదఁగ యేసు నీదైన యాత్మ నాకందఁగ
    జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రార్థన నాయందు దయచేసి నా మనవి
    నాలించు
    ||ఏమి||

4.  నేను జేసిన యఘము లెల్లను గర్త నీ యెదుటఁ దలంచు కొందును
    నేను సిగ్గు నొంది నిజముగఁ గుందుచు నేను వేఁడుకొందు నీ
    క్షమాపణ కొరకు
    ||ఏమి||

5.  నన్ను నీవు స్థిరపరచుము కర్త యన్నిట నను బలపరుచుము తిన్నని
    మార్గమున దృఢముగ నేగుచు నిన్ను నే స్తుతియింతు నిండుగ నెల్లప్పు
    ||ఏమి||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------