496) ఏమి తెచ్చి నిను దర్శింతునయా

** TELUGU LYRICS **    

    ఏమి తెచ్చి నిను దర్శింతునయా
    ఏ రీతిగా నిను పూజింతునయా
    వినయముగా నీ సన్నిధి మ్రొక్కి
    స్తుతియాగము చేతునయా

1.  వెండి బంగారములు నీవే గదా
    కొండపైని పశువులు నీ వశమే గదా
    విరిగిన మనస్సు నలిగిన హృదయం
    నీవు కోరిన దూపమాయ 
    ||ఏమి||

2.  ప్రథమ ఫలములు నీ సేవకీయనా
    దహన బలుల నైవేద్యమీయనా
    సజీవయాగముగా దేహమర్పించుట
    నీదు దృష్టికి యుక్తమయా
    ||ఏమి||

3.  మంచి తైలముతో అభిషేకించనా
    ఎంచి కానుకలిచ్చి భజయించనా
    న్యాయముగా నడచుట కనికరము చూపుట
    నీకిష్టమైన యాగమయా
    ||ఏమి||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------