6009) సంవత్సరములు గడుచుచుండగా నీ కృపలో నేనుండగా

** TELUGU LYRICS **

సంవత్సరములు గడుచుచుండగా నీ కృపలో నేనుండగా 
జడియను నే బెదరను - నే నే స్థితిలో ఉన్నాను
విడువవు ఎడబాయవు నాదే పరిస్థితి ఐనను 
నీ దుడ్డు కర్రయు నీ దండము - నన్నాదరించును
||సంవత్సరములు||

1. క్షామ కాలమందు ఎలియాకు నీవు 
కాకులతో ఆహారమందిచినావు (2)
నా మంచి పోషకుడా - నా జీవన ఆధారమా (2)
గళమెత్తి నిన్నే - కీర్తించి పాడి - ఆరాధించేదను (2) 
||విడువవు||

2. మరణకరమైన రోగము నుండి
హిజ్కియాను నీవు స్వస్థ పరిచినావు (2)
నా పరమ వైద్యుడా - నా ఆశ్రయ దుర్గమా (2)
గళమెత్తి నిన్నే - కీర్తించి పాడి - ఆరాధించేదను (2)
||విడువవు||

3. పాపమందు నేను - జీవించు చుండగా
నీ ప్రేమతో - నన్ను రక్షించినావు (2)
నా మంచి కాపరి - నా రక్షక యేసయ్య (2)
గళమెత్తి నిన్నే - కీర్తించి పాడి - ఆరాధించేదను (2)
||విడువవు||

** ENGLISH LYRICS **

Samvathsaramulu Gaduchuchundagaa Nee Krupaloo Nenundagaa
Jadiyanu Ne Bedaranu - Ne Ne Sthithilo Unnaanu
Viduvavu Edabaayavu Naadhe Paristhithi Ainanu
Nee Duddu Karrayu Nee Dandamu - Nannaadharinchunu
||Samvathsaramulu||

Kshaama Kaalamandhu Eliyaaku Neevu
Kaakulatho Aahaaramandichinaavu (2)
Naa Manchi Poshakudaa - Naa Jeevana Aadhaaramaa (2)
Galametthi Ninne - Keerthinchi Paadi - Aaraadhinchedhanu (2)
||Viduvavu||

Maranakaramaina Rogamu Nundhi
Hijkiyaanu Neevu Swastha Parichinaavu (2)
Naa Parama Vaidhyudaa - Naa Aashraya Durgamaa (2)
Galametthi Ninne - Keerthinchi Paadi - Aaraadhinchedhanu (2)
||Viduvavu||

Paapamandhu Nenu - Jeevinchu Chundagaa
Nee Prematho - Nannu Rakshinchinaavu (2)
Naa Manchi Kaapari - Naa Rakshaka Yesayya (2)
Galametthi Ninne - Keerthinchi Paadi - Aaraadhinchedhanu (2)
||Viduvavu||

---------------------------------------------------
CREDITS : Lyrics : Ch. Gershom
Music : Bro KY Ratnam
Vocals : Sis. Sharon Philip 
---------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post