5937) యేసు రాజు పుట్టాడంట ఊరువాడ సంబరమంట రారండో

** TELUGU LYRICS **

యేసు రాజు పుట్టాడంట
ఊరువాడ సంబరమంట రారండో
నింగి నేల పరవశించి గంతులు వేసి 
ఆడేనంట చూడండో (2)
లేఖనాల నెరవేర్పే యేసు రాజు పుట్టుకంట
అంబరాన్ని తాకేనంట ఈ సంబరమే 
దివి భూమి ఏకమయ్యే ఈనాడు
లోకాలనేలే రాజు పుట్టాడు 
జగమే కంపించే ఈనాడు
అంతా సంతోషం ప్రతిరోజు

పరమును విడిచిన పరమాత్ముడు
పాపము ఎరుగని పరిశుద్ధుడు 
మరియకు సుతునిగా మనుజుడై
భువికరుదించిన బగవంతుడు (2)
అంధకారమునే అంతము చేయగా
సర్వ జగతికి ప్రేమను పంచగా (2)
దివిని విడచి ధరనణికొచ్చాడు

చరితకు యేసే కొలమానము
దీనిలో లేదు అనుమానము
యేసే మోక్షానికి మార్గము 
నమ్మితే ఆయన నీ సొంతము
క్రీస్తుని జననము - ఇల ప్రత్యేకము 
విడువము పాపము - ప్రభువును నమ్ముము
తారగ దివినందు వెలుగుము
||దివి||

 ** ENGLISH LYRICS **

Yesu Raaju Puttaadanta
Ooruvada Sambaramantha Raarando
Ningi Nela Paravashinchi Ganthulu Vesi
Aadenanta Choodando (2)
Lekhanaala Neraverpe Yesu Raaju Puttukanta
Ambaranni Thaakenanta Ee Sambarame
Divi Bhoomi Ekamayye Eenaadu
Lokaalanele Raaju Puttaadu
Jagame Kampinche Eenaadu
Anthaa Santhosham Prathiroju

Paramunu Vidichina Paramaathmudu
Paapamu Erugani Parishuddhudu
Mariyaku Suthunigaa Manujudai
Bhuvikarudinchina Bhagavanthudu (2)
Andhakaaramune Anthamu Cheyagaa
Sarva Jagathiki Premanu Panchagaa (2)
Divini Vidachi Dharananikocchaadu

Charithaku Yese Kolamaanamu
Deenilo Ledu Anumaanamu
Yese Mokshaaniki Maargamu
Nammithe Aayana Nee Sonthamu
Kreesthuni Jananamu – Ila Prathyekamu
Viduvamu Paapamu – Prabhuvunu Nammumu
Thaaraga Divinandu Velugumu
||Divi||

--------------------------------------------------------
CREDITS : Tune, Music : KJW Prem
Lyrics : P Methushelah
Vocals : Sahithi Chaganti
--------------------------------------------------------