5938) కీర్తించరే రాజును కీర్తించరే కొనియాడరే

** TELUGU LYRICS **

కీర్తించరే రాజును కీర్తించరే కొనియాడరే యేసును కొనియాడరే
నింగిలో ఒక తార మెరిసిపోతుంది - రక్షకుడు పుట్టెనని కనువిందు చేసింది 
గగనవీధుల్లోన సందడి చేసింది - పరిశుద్ధ ప్రభువుకు స్వాగతమే పలికింది -(2)
కీర్తించరే రాజును కీర్తించరే - కొనియాడరే యేసును కొనియాడరే

మహిమగల మహారాజు - ముద్దులొలికించే మురిపాల బాలుడు 
కన్య మరియా నిన్ను కడుపునమొసి - పునితురాలయింది 
అద్వితీయారూపుడు అతి సుందరుడు - పాపమన్నది లేని పరిశుద్ధుడు -(2) 
లోకాలనేలే లోకరక్షకుడు ఉఉఉఉ (2) 
పశులశాలలోన పవళించినాడు
కీర్తించరీ రాజును కీర్తించరే - కొనియాడరే యేసును కొనియాడరే

దవలవర్ణుడు రత్నవర్ణుడు - రవి కోటి తేజు 
పాప శాపమును తొలగించ నేడు - భువిలోకి ఏతించెను 
కరుణగలవాడు కరుణామయుడు - దయగలవాడు దయామయుడు (2) 
రాజులకు రాజుగా రానైయూన్నాడు ఉఉఉఉ (2) 
పరిశుద్ధులందరిని కొనిపోతాడు

కీర్తించరే రాజును కీర్తించరే - కొనియాడరే యేసును కొనియాడరే  
నింగిలో ఒక తార మెరిసిపోతుంది - రక్షకుడు పుట్టేనని కనువిందు చేసింది 
గగనవీధుల్లోన సందడి చేసింది - పరిశుద్ధ ప్రభువుకు స్వాగతమే పలికింది (2)
కీర్తించరే రాజును కీర్తించరే యేసును కొనియాడరే

 ** ENGLISH LYRICS **

Keerthinchare Raajunu Keerthinchare Koniyaadare Yesunu Koniyaadare
Ningilo Oka Thaara Merisipothundi – Rakshakudu Puttenani Kanuvindu Chesindi
Gaganaveedhullona Sandadi Chesindi – Parishuddha Prabhuvuku Swaagathame Palikindi (2)
Keerthincharē Raajunu Keerthinchare – Koniyaadarē Yesunu Koniyaadare

Mahimagala Maharaaju – Muddulolikinche Muripaala Baaludu
Kanya Mariyaa Ninnu Kadupunamosi – Punituraalayindi
Adhviteeyaroopudu Athi Sundarudu – Paapamannadi Leni Parishuddhudu (2)
Lokaalanele LokaRakshakudu Uuuuuu (2)
Pashulashaalalona Pavalinchinaadu
Keerthincharē Raajunu Keerthinchare – Koniyaadare Yesunu Koniyaadarē

Dhavalavarnudu Rathnavarnudu – Ravi Koti Theju
Paapa Shaapamunu Tholagincha Nedu – Bhuviloki Yethinchenu
Karunagalavaadu Karunaamayudu – Dayagalavaadu Dayaamayudu (2)
Raajulaku Raajugaa Raanaiyunnadu Uuuuuu (2)
Parishuddhulandharini Konipothaadu

Keerthincharē Raajunu Keerthinchare – Koniyaadarē Yesunu Koniyaadare
Ningilo Oka Thaara Merisipothundi – Rakshakudu Puttenani Kanuvindu Chesindi
Gaganaveedhullona Sandadi Chesindi – Parishuddha Prabhuvuku Swaagathame Palikindi (2)
Keerthinchare Raajunu Keerthinchare Yesunu Koniyaadare

------------------------------------------------------------
CREDITS : Music : Jenith
Lyrics, Tune, Vocals : Kaluvala Srinivas
------------------------------------------------------------