5886) మేలు చేయాలని దీవించాలని నీ కృపలోనే దాచాలని

** TELUGU LYRICS **

మేలు చేయాలని దీవించాలని - నీ కృపలోనే దాచాలని 
ఊహించని కార్యములు నాలో జరగాలని - సమృద్ధితో నింపాలని (2) 
ఆశయ్యా నీ ఆశయ్యా 

ఘనపరచువాడవు కృపచూపువాడవు - పడిపోయిన స్థితినుండి పైకిలేపు దేవుడవు (2) 
నీ రక్షణ కంచెఉంటే - నన్ను తాకేదెవరయ్యా
నీవే నన్ను కోరుకుంటే - నన్ను దాటేదెవరయ్యా 
కడవరకు నా సాక్ష్యమును - కాపాడుకొందునయ్యా 
||మేలు చేయాలని||

నా ఒంటరి పయనంలో - నీ దూతల తోడుంచావు 
నేవేయు ప్రతి అడుగులో - నా ముందర నీవున్నావు (2) 
నీ కంచెలేకుండా - తిరిగిరాలేనయ్యా (2) 
నా రక్షణశృంగమా నీవు లేనిదే - నే బ్రతుకగలనా
||మేలు చేయాలని||

ప్రాణమున్నంతవరకు - పరవశించి నే పాడెదా
నీ కృపలను తలపోయుచు - నిన్ను ఆరాధించెదా (2) 
ఓపిక ఉన్నంతవరకు - కాదయ్యా నీ సేవ (2) 
నాలో ఊపిరి ఉన్నంతవరకు - చేయాలయ్యా నీ సేవ
||మేలు చేయాలని||

 ** ENGLISH LYRICS **

Melu Cheyaalani Deevinchaalani - Nee Krupalone Daachaalaani
Oohinchani Kaaryamulu Naalo Jaragaalani - Samruddhitho Nimpaalani (2)
Aashayya Nee Aashayya

Ghanaparachuvaadavu Krupachoopuvaadavu - Padipoyina Sthithinundi Paikilepu Devudavu (2)
Nee Rakshana Kanche Unte - Nannu Taaked Evarayya
Neeve Nannu Korukunte - Nannu Daated Evarayya
Kadavarku Naa Saakshyamunu - Kaapaadukondunayya
||Melu Cheyaalani||

Naa Ontari Payanamlo - Nee Doothala Thodunchaavu
Neveyu Prathi Adugulo - Naa Mundara Neevunnaavu (2)
Nee Kanche Lekunda - Thirigiraalenayya (2)
Naa Rakshana Shrungamaa Neevu Lenide - Ne Brathukagalanaa
||Melu Cheyaalani||

Praanamunnanthavaraku - Paravashinchi Ne Paadedaa
Nee Krupalanu Thalapoyuchu - Ninnu Aaraadhinchedhaa (2)
Opika Unnanthavaraku - Kaadayyaa Nee Seva (2)
Naalo Oopiri Unnanthavaraku - Cheyaalayyaa Nee Seva
||Melu Cheyaalani||

-------------------------------------------------------------------
CREDITS : Lyrics, Music : Gotikala Joshua
-------------------------------------------------------------------