** TELUGU LYRICS **
నీ కృపాతిశయమును అనునిత్యము
నే కీర్తించెదా తరతరములకు
నీ విశ్వాస్యతను నే ప్రచురింతును
నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనది
మౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకా
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరేవరకు
నే కీర్తించెదా తరతరములకు
నీ విశ్వాస్యతను నే ప్రచురింతును
నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనది
మౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకా
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరేవరకు
ఇంకా బ్రతికి ఉన్నామంటే - కేవలము నీ కృపా
ఇంకా సేవలో ఉన్నామంటే - కేవలము నీ కృపా
ఏ మంచితనము - లేకున్ననూ కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకొన్నది నీ కృపా
||నీ కృపా||
పది తరములుగా వెంటాడిన - మోయాబు శాపము
నీ కృపను శరణు వేడగా - మార్చేనే వెయ్యి తరములు
అన్యురాలైన ఆ రూతును - ధన్యురాలుగా మార్చినది
నీ కృపయే నన్ను దీవించగా
ఏ శాపము నాపై పనిచేయదు
||నీ కృపా||
ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే - కేవలము నీ కృపా
మెతుకు బ్రతుకు ఉన్నాయంటే - కేవలము నీ కృపా
కృపతోనే రక్షణనిచ్చావు - నా క్రియల వలన కానే కాదు
జీవితమంతా ఋణస్థుడను
నీయందే నిత్యము అతిశయము
||నీ కృపా||
ఇల్లు వాహనం ఉన్నాయంటే - నీదు కృపాదానమే
బలము ధనము ఉన్నాయంటే - నీదు కృపా దానమే
ఏ అర్హత నాలో లేకున్ననూ - కృపా భిక్షయే నా యెడల
జీవితమంతా కృతజ్ఞుడను
జీవితమంతా పాడెదను
||నీ కృపా||
ప్రియులే నన్ను విడనాడినా - శోకమే నా లోకమా
అనాధగానే మిగిలానే - నా కథ ముగిసినదే
నీ కుడిచేతిలో ఉంచగనే - బెన్యామీను వంతుగా మారే
ఐదంతలాయే నా భాగ్యము
విధిరాతనే మార్చెనే నీ కృపా
||నీ కృపా||
** ENGLISH LYRICS **
Nee Krupaathishayamunu Anunithyamu
Nae Keerthinchedhaa Tharatharamulaku
Nee Vishwaasyathanu Nae Prachurinthunu
Nee Krupaa Nee Krupaa Aakaashamukantae Hecchainadhi
Maunigaa Yetulundedhaa Saakshigaa Prachurinchakaa
Naa Thudhi Shwaasa Varaku Nee Chentha Chaerauvaraku
Inkaa Brathiki Unnaamanthe - Kaevalamu Nee Krupaa
Inkaa Saevalo Unnaamanthe - Kaevalamu Nee Krupaa
Ea Manchithanamu - Laekunnanuu Konasaaginchinadhi Nee Krupaa Nilabettukonnadhi Nee Krupaa
||Nee Krupaa||
Padhi Tharamulugaa Ventaadina - Mooyaabu Shaapamu
Nee Krupanu Sharanu Vaedhagaa - Maarchenae Veyyi Tharamulu
Anyuraalaina Aa Roothunu - Dhanyuraalugaa Maarchinadhi
Nee Krupayae Nannu Dheevinchagaa
Ea Shaapamu Naapai Panichaeyadhu
||Nee Krupaa||
Aaroogyam Udyogam Unnaayanthe - Kaevalamu Nee Krupaa
Methuku Brathuku Unnaayanthe - Kaevalamu Nee Krupaa
Krupathonae Rakshananicchaavu - Naa Kriyala Valana Kaanae Kaadhu
Jeevithamanthaa Runasthudanuu
Neeyandhae Nithyamu Athishayamu
||Nee Krupaa||
Illu Vaahanam Unnaayanthe - Needu Krupaadhaanamae
Balamu Dhanamu Unnaayanthe - Needu Krupaa Dhaanamae
Ea Arhatha Naalo Laekunnanuu - Krupaa Bhikshayae Naa Yedala
Jeevithamanthaa Kruthanjudhanuu
Jeevithamanthaa Paadedhanuu
||Nee Krupaa||
Priyulae Nannu Vidanaadinaa - Shokamae Naa Lokamaa
Anaadhagaanae Migilaanae - Naa Katha Muginasinadhae
Nee Kudichaethilo Unchaganae - Benyaameenu Vanthugaa Maarae
Aidhanthalaayae Naa Bhaagyamu
Vidhirathaenae Maarchenae Nee Krupaa
||Nee Krupaa||
---------------------------------------------------------------
CREDITS : Music : John Pradeep
Lyrics, Tune, Vocals : Dr. Asher Andrew
---------------------------------------------------------------