5597) అంత్యదినములివి అపాయకరమైన కాలమిది

** TELUGU LYRICS **

అంత్యదినములివి అపాయకరమైన కాలమిది (2)
మగతను వీడుము ఓ సోదరా
కన్నులు తెరువుము ఓ సోదరి (2)
యేసయ్య రాకడ సమీపించెను 
ప్రభుని దినము సమీపించెను (2)
||అంత్యదినములివి||

విలువైన ప్రభు సేవకు బలిపీఠపు పరిచర్యకు 
యాజక ధూపమునకు ప్రభువు పిలచుచుండె (2)
సంసిద్దమా పరిశుద్ధమా 
నీవు సిద్ధమా (2)
||అంత్యదినములివి||

ఎడతెగని ప్రార్థనలకు విజ్ఞాపన పరిచర్యకు 
ఉపవాస ప్రతిష్టతకు ప్రభువు పిలచుచుండె (2)
సంసిద్దమా పరిశుద్ధమా 
నీవు సిద్ధమా (2)
||అంత్యదినములివి||

విధేయత గలవారి కొరకు భక్తిలో శక్తి కొరకు
దేవుని ప్రేమించుటకు ప్రభువు పిలచుచుండె (2)
సంసిద్దమా పరిశుద్ధమా 
నీవు సిద్ధమా (2)
||అంత్యదినములివి||

--------------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Pas. G. Krupa Wesley 
Tune & Music : Sis. G. Lilly Sharon & Sandeep Darsanapu
Vocals : Pas. G. Sunny Daniel, Sis. G. Lilly Sharon, Dr. G. Evangeline Blessy
--------------------------------------------------------------------------------------------------------------------