** TELUGU LYRICS **
నా దేవుడు గొప్పవాడు ఏదైనా చెయ్యగలడు
ప్రభువెపుడు ఓడిపోడు ఓడి పోడు ఓడిపోడు
సరియైన సమయమందే రంగంలో దూకుతాడు
ముందు రాడు - ఆలస్యమవ్వడు - ముందు రాడు ఆలస్యమవ్వడు
భవిష్యత్ ఏమౌతుందోనన్న భయము లేదు నాకు
రేపు ఏ మలుపు ఉందోనన్న చింత లేదు నాకు
అరె! నా జీవితం - ప్రభుని చేతిలో (2)
ఉంచి నేను నిశ్చింతగా ఉన్నా
ప్రభువెపుడు ఓడిపోడు ఓడి పోడు ఓడిపోడు
సరియైన సమయమందే రంగంలో దూకుతాడు
ముందు రాడు - ఆలస్యమవ్వడు - ముందు రాడు ఆలస్యమవ్వడు
భవిష్యత్ ఏమౌతుందోనన్న భయము లేదు నాకు
రేపు ఏ మలుపు ఉందోనన్న చింత లేదు నాకు
అరె! నా జీవితం - ప్రభుని చేతిలో (2)
ఉంచి నేను నిశ్చింతగా ఉన్నా
నేనేమి అవ్వవలెనో - ఖచ్చితంగా తెలిసినోడు - ముందే నిర్ణయించినాడు
నన్నేమి చెయ్యవలెనో - ప్రభు చేసి తీరుతాడు - ఆపేటివాడు ఎవడు?
నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే
నను గూర్చి తనదు గ్రంధములో వ్రాసి ఉంచినాడు
నా పాపంకొరకు ప్రభువు-జగతికి ఉత్పత్తి మొదలు-వధియింపబడియున్నాడు
ఏదైనా సమస్య నాపై - దండెత్తి రాక మునుపే - పరిష్కారం సిద్ధపరుస్తాడు.
నా మేలు కొరకు అన్నియును సమకూర్చి జరుపు ప్రభువు
నా పక్షమందు కార్యమును సఫలపరచుతాడు.
God Knows the End from the Beginning
నాకేమి అవసరములో - నేనింకా అడగనపుడే - నా తండ్రికి ముందే తెలుసు
నాకింక ఏమి కొదువ? - క్రీస్తేసు మహిమ వలన - సర్వ సమృద్ధి కలదు
తన సొంత కొడుకునే నా కొరకు యిచ్చేసినాడు తండ్రి
ఆయనతో పాటు అన్నియును యిచ్చి తీరుతాడు
మన దేవుని వాగ్దానములు- అన్నియును క్రీస్తునందు- అవును ఆమేన్ నాకు
వాగ్దానం చేసినోడు - ఎప్పుడూ నమ్మదగినవాడు - నాకసలు దిగులు లేదు
ఈ భూమి కంటె ఆకాశములు ఎంతెత్తుగా ఉన్నాయో
నా కొరకు ప్రభుని ఉద్దేశ్యములు - అంత ఉన్నతములు
I’m Safe in the Hands of My Father (Jesus Christ) (Holy Spirit)
తొట్రిల్లకుండ నన్ను - కాపాడగలిగినోడు - శక్తి గల రక్షకుండు
తన మహిమ యెదుట నన్ను - నిర్దోషిగా నిలువబెట్టి - ఆనందిస్తున్నవాడు
తన ఆత్మ చేత ముద్రించెను నను నా ప్రభువు వచ్చువరకు
నను తండ్రి చేతిలోనుండెవడు అపహరింపలేడు!
** ENGLISH LYRICS **
Naa Dhaevudu Goppavaadu Edhainaa Cheyyagaladu
Prabhuvepudu Oadipoadu Oadi Poadu Oadipoadu
Sariyaiana Samayamandhae Rangamlo Dhookuthaadu
Mundu Raadu - Aalas yamavvaddu - Mundu Raadu Aalas yamavvaddu
Bhavishyat Aemauthoandhoananna Bhayamu Laedhu Naaku
Raepu Ae Malupu Undoananna Chintha Laedhu Naaku
Are! Naa Jeevitham - Prabhuni Chethilo (2)
Unchi Naenu Nishchinthagaa Unnaa
Naenemi Avvavaleno - Khachithangaa Thelisinodu - Mundhae Nirnayinchinaadu
Nannaemi Cheyyavaleno - Prabhu Chesi Theeruthaadu - Aapetivaadu Evadu?
Niyamimpabadina Dhinamulalo Okatainaa Kaakamunupae
Nanu Goorchi Thanadhu Grandhamulo Vraasi Unchinaadu
Naa Paapamkoraku Prabhuvu-Jagathiki Utpatthi Modalu-Vadhiyimpabadiyunnaadu
Edhainaa Samasya Naapai - Dandetthi Raaka Munupae - Parishkaaram Siddhaparusthaadu.
Naa Maelu Koraku Anniyunu Samakoorchi Jarupu Prabhuvu
Naa Pakshamandhu Kaaryamunu Saphalaparachuthaadu.
God Knows the End from the Beginning
Naakaemi Avasaramulo - Naeninkaa Adaganapudae - Naa Thandriki Mundhae Thelusu
Naakinka Emi Kodhuva? - Kreesthaesu Mahima Valana - Sarva Samrudhdhi Kaladhu
Thana Sontha Kodukunae Naa Koraku Yicchesinaadu Thandri
Aayanatho Paatu Anniyunu Yicchi Theeruthaadu
Mana Dhaevuni Vaagdaanamulu- Anniyunu Kreesthunandhu- Avunu Aamaen Naaku
Vaagdaanam Chesinodu - Eppudu Nammadhaginavaadu - Naakasalu Digulu Laedhu
Ee Bhoomi Kante Aakaashamulu Enthetthugaa Unnaayo
Naa Koraku Prabhuni Uddhaeshyamulu - Antha Unnathamulu
I’m Safe in the Hands of My Father (Jesus Christ) (Holy Spirit)
Thotrillukunda Nannu - Kaapaadagaliginodu - Shakthi Gala Rakshakundu
Thana Mahima Yedhuta Nannu - Nirdooshigaa Niluvabetti - Aanandhisthunnavaadu
Thana Aathma Chaetha Mudhrinchenu Nanu Naa Prabhuvu Vacchuvaraku
Nanu Thandri Chethiloanundevadu Apaharimpaladu!
---------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tunes & Music : Bro. M. Vinod Kumar
Album : Jesus My Only Hope (Bro M. Anil Kumar)
--------------------------------------------------------------------------------------