** TELUGU LYRICS **
బంధకములలో పడియుండియూ నిరీక్షణ గలవారలారా!
దినదినమును వధకు సిద్ధమైన గొర్రెవలె ఉన్నవారలారా!
మీ తలలు మరలా పైకి ఎత్తుడి
మీ ధూళిని దులిపి లేచి నిలువుడి
మీ కోటలో మరలా ప్రవేశించుడి
Double Portion – Hey! Double Portion
యేసయ్యలోన యిది నీ స్వాస్థ్యము
Double Portion – Hey! Double Portion
అవమానమంతా మరిచేంత ఆనందము / ఆశీర్వాదము
దినదినమును వధకు సిద్ధమైన గొర్రెవలె ఉన్నవారలారా!
మీ తలలు మరలా పైకి ఎత్తుడి
మీ ధూళిని దులిపి లేచి నిలువుడి
మీ కోటలో మరలా ప్రవేశించుడి
Double Portion – Hey! Double Portion
యేసయ్యలోన యిది నీ స్వాస్థ్యము
Double Portion – Hey! Double Portion
అవమానమంతా మరిచేంత ఆనందము / ఆశీర్వాదము
క్రిందికి వంగి సాగిలపడుము దాటిపోవాలి మేము అని అనగా
నీ వీపును నేలకు వంచి దాటువారికి దారిని చేసినావుగా
సీయోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరియించు
నీకు వెలుగు వచ్చెను - నీకు వెలుగు వచ్చెను
నిన్ను బాధించినవారి చేతనే నా క్రోధ పాత్ర
మొత్తము త్రాగిస్తా నేను - మొత్తము త్రాగిస్తా
నువు తగ్గింపబడుట చూడకుందునా
నీ అవమానం చూచి ఊరకుందునా
నిను పైపైకి నేను హెచ్చించనా
విడువబడి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడినదానా
తృణీకారమై దుఖ:పడి ఏ ఆదరణ లేకయున్నదానా
విడనాడబడితివని నిను గూర్చి చెప్పబడదు
క్రొత్త పేరు పెడుతున్నాను - క్రొత్త పేరు పెడుతున్నాను
పాడైన దేశం అంటూ నీ భూమి పిలువబడదు
యిష్టురాలవు నువ్వు - యిష్టురాలవు
నిను నీలాంజనములతో కట్టనా
నీ కట్టడాన్ని మణులతో నిర్మించనా
సూర్యకాంతములతో అలంకరించనా
సంసారి పిల్లల కంటే విడువబడినదాని పిల్లలధికమగును
ఈ స్థలము యిరుకు మాకు’ అని చెప్పునంత విస్తారమగును
జయకీర్తనెత్తి నువ్వు ఆనందగానం చెయ్యి
జయగీతం ఎత్తాలి నువ్వు - జయగీతం ఎత్తాలి నువ్వు
నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు
అవమానం తలంచకు నువ్వు - అవమానం
నీ పిల్లలకు నేనే ఉపదేశింతును
అధిక విశ్రాంతి వారికి కలుగజేతును
నిన్ను నీతి గలదానిగా స్థాపింతును
ప్రభువు నన్ను మరచియున్నాడు అని సీయోను అనుకొననేల?
ఒంటరినై విడువబడితిని అని మనస్సులో బాధపడనేల?
తల్లైనా మరచునేమో నేను నిన్ను మరువలేను
నేనే నిను ఓదారుస్తాను - నేనే నిను ఓదారుస్తాను
ఒంటరియైనవాడు వేయిమంది అవుతారింక
బలమైన జనమౌదువు నువ్వు - బలమైన
నువు కుడి యెడమలకు వ్యాపింతువు
శత్రు గవిని స్వాధీన పరచుకొందువు
నువ్వు నీ నిందనంతా మరచిపోదువు
నిమిష మాత్రం విసర్జిoచితిని గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తా నిన్ను
నిత్యమైన కృపను చూపి నా నిబంధన నెరవేరుస్తాను నేను
బాధించువారు నీకు దూరంగా ఉందురు గనుక
భీతి నీ దగ్గరకు రాదు - భీతి నీ దగ్గరకు రాదు
నీకు విరోధముగా గుంపు కూడువారు నీ
పక్షంగా చేస్తాను నేను - పక్షంగా
నీ నీతి నా వలన కలుగుచున్నది
న్యాయవిమర్శలో నీకే జయమున్నది
నీపై ఏ ఆయుధము వర్ధిల్లకున్నది
** ENGLISH LYRICS **
Bandhakamulalo Padiyundiyoo Nireekshana Galavaaralaaraa!
Dhinadhinamunu Vadhaku Siddhamaina Gorrevale Unnavaaralaaraa!
Mee Thalalu Maralaa Paiki Etthudi
Mee Dhuulini Dhulipi Laechi Niluvudi
Mee Koatalo Maralaa Pravaeshinchudi
Double Portion – Hey! Double Portion
Yaesayyalona Yidhi Nee Swaasthyamu
Double Portion – Hey! Double Portion
Avamaanamanthaa Marichaentha Aanandhamu / Aasheervaadhamu
Krindhiki Vangi Saagilapadumu Daatipovaali Maemu Ani Anagaa
Nee Veepunu Naelaku Vanchi Daatuvaariki Dhaarini Chaesinaavugaa
Seeyoanu Lemmu Lemmu, Nee Balamu Dhariyinchu
Neeku Velugu Vacchenu - Neeku Velugu Vacchenu
Ninnu Baadhinchinavaari Chaethanae Naa Kroodha Paathra
Motthamu Thraagisthaa Naenu - Motthamu Thraagisthaa
Nuvu Thaggimpabaduta Choodakundunaa
Nee Avamaanam Choochi Oorakundunaa
Ninu Paipaiki Naenu Hecchinchanaa
Viduvabadi Prayaasapadi Gaalivaana Chaetha Kottabadinadhanaa
Thruneekaaramai Dhukha:Padi Ae Aadharana Laekayunnadhanaa
Vidanaadabadithivani Ninu Goorchi Cheppabadadhu
Krotha Paeru Peduthunnaanu - Krotha Paeru Peduthunnaanu
Paadaina Dhaesham Antuu Nee Bhoomi Piluvabadadhu
Yisthuraalavu Nuvvu - Yisthuraalavu
Ninu Neelaanjanamulatho Kattanaa
Nee Kattadaanni Manulatho Nirminchanaa
Sooryakaanthamulatho Alankarinchaanaa
Samsaari Pillala Kante Viduvabadinadhani Pillaladhikamagunu
Ee Sthalamu Yiruku Maaku’ Ani Cheppunantha Visthaaramagunu
Jayakeerthanetthi Nuvvu Aanandhagaanam Cheyyi
Jayageetham Etthaali Nuvvu - Jayageetham Etthaali Nuvvu
Ninnu Srushtinchinavaadu Neeku Bharthayaiyunnadu
Avamaanam Thalangachaku Nuvvu - Avamaanam
Nee Pillalaku Naenae Upadhaeshinthunu
Adhika Vishraanthi Vaariki Kalugajaethunu
Ninnu Neethi Galadhaanigaa Sthaapinthunu
Prabhuvu Nannu Marachiyunnadu Ani Seeyoanu Anukonanelaa?
Ontarinai Viduvabadithini Ani Manassulo Baadhapadanelaa?
Thallainaa Maruchunaemo Naenu Ninnu Maruvalenu
Naenae Ninu Oadhaarusthaanu - Naenae Ninu Oadhaarusthaanu
Ontariyainavaadu Yaeimandi Authaarinka
Balamaina Janamauduvu Nuvvu - Balamaina
Nuvu Kudi Yedhamalaku Vaapinthuvu
Shatru Gavinini Swaadheena Parachukonduvu
Nuvvu Nee Nindhananthaa Marachipoadhuvu
Nimisha Maathram Visarjinchi-Thini Goppa Vaathsalyatho Samakoorusthaa Ninnu
Nithyamaina Krupanu Choopi Naa Nibandhana Neravaerusthaanu Naenu
Baadhinchuvaaru Neeku Dhoorangaa Unduru Ganaka
Bheethi Nee Dhaggaraku Raadhu - Bheethi Nee Dhaggaraku Raadhu
Neeku Viroadhamugaa Gumpu Kooduvaaru Nee
Pakshamugaa Chaesthaanu Naenu - Pakshamugaa
Nee Neethi Naa Valana Kaluguchunnadhi
Nyaayavimarshaloo Neekae J ayamunnadhi
Neepai Ae Aayudhamu Vardhillakunnadhi
---------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tunes & Music : Bro. M. Vinod Kumar
Album : Jesus My Only Hope (Bro M. Anil Kumar)
--------------------------------------------------------------------------------------