5466) జాలి చూపేవారు లేక జారిపోయిన హృదయమా

** TELUGU LYRICS **

జాలి చూపేవారు లేక - జారిపోయిన హృదయమా
మనసే లేని మనుషులంతా మనసు గాయం చేసిరా
నీ మనసు గాయం చేసిరా  ||జాలి||
ప్రేమరూపి కలనైనా మరువలేడమ్మా
నిను మరువలేడమ్మ
||జాలి||

దేవుడేమి చేసాడంటూ - దీవెనేమి చూసావంటు 
నిందించిరా - నిన్ను నిలదీసిరా
కాలామంతా కలగానే మిగిలిపోవు ననుకుంటూ 
క్రుంగిపోతివా - నీవు కుమిలి పోతివా
ఓటమి ఎపుడు అంతమే కాదని తెలుసుకోవమ్మా 
గెలుపు ఉండకపోదమ్మా  
||జాలి||

నేనేం తప్పు చేశానంటూ - నాకే ఎందుకు ఇలా అంటూ 
తలచుచుంటివా - బ్రతుకే భారమంటివా
నీవెన ఆస్తి అంటూ - తగిన కాలం వస్తుందంటూ 
మాటనిచ్చిన యేసుని - మాట మరచితివా 
నిందించే మనుషులేదుటే - నిలుపునో అమ్మా 
మేలు కలుగునో అమ్మా
||జాలి||

------------------------------------------------------------------
CREDITS : Music : Jonah Samuel
Lyrics, Tune, Vocals : Bro. Samuel Karmoji
------------------------------------------------------------------