** TELUGU LYRICS **
నా యేసయ్యా నీ కృప మరవలెనయ్యా
నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా (2)
నీ నామ స్మరణలో దాగిన జయము
నీ వాక్య ధ్యానములో పొందిన బలము (2)
తలచుకుని నా యాత్రను
నే కొనసాగించెదా (2)
ఆహ్ హల్లెలూయా
ఓహో హోసన్నా
||నా యేసయ్య||
నా గుమ్మముల గడియాలు బలపరిచితివి
నీ చిత్తములో అడుగులు స్థిరపరిచితివి (2)
నా సరహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడిచె భాగ్యమునిచ్చితివి
ఆహ్ హల్లెలూయా
ఓహో హోసన్నా
||నా యేసయ్య||
నీ వాగ్దానములెన్నో నేరవీర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి (2)
నా భయభీతులలో నీ వాకును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి
ఆహ్ హల్లెలూయా
ఓహో హోసన్నా
||నా యేసయ్య||
-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Vocals : Dr.P.Satish Kumar Garu,
Saahus Prince, Suneel, Anup Rubens
-------------------------------------------------------------------------------