5464) ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే

** TELUGU LYRICS **

ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే
అది కేవలం నీ కృప ఏనయా (2)
ప్రతి క్షణము నా వెన్నంటి నడిచినావు 
కంటిపాపల నన్ను కాచినావు (2)
స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య (2)
నిరాశలో ఉన్నప్పుడు ఆశగా చిగురించావు 
శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు 
నీకు సరిపోల్చగా వేరేవరు లేరయ్యా
నిను గాక దేనిని నే కోరలేదయ్యా
బ్రతుకంతా నీ కొరకై ఈల జీవింతునయ్యా 
||స్తోత్రం||

కలవర మందు ఉన్నప్పుడు కలతను తొలగించావు
ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైనావు (2)
నీవంటి దేవుడు ఇంకెవరూ లేరయ్యా 
నీ ప్రేమకై నేను ఏమి ఇవ్వగలనయ్యా (2)
బ్రతుకంతా నీ కొరకైలా జీవింతునయ్యా (2) 
||స్తోత్రం||

పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు
శాపము నంతా తొలగించి పరిశుద్ధతని ఇచ్చావు 
నీదు బలియాగమే నన్ను బ్రతికించినది 
నీ సిలువ యాగమే నన్ను రక్షించినది (2)
బ్రతుకంతా నీ కొరకై ఎల జీవింతునయ్యా (2) 
||స్తోత్రం|| ||ఈ క్షణమున|| 

-----------------------------------------------
CREDITS : 
-----------------------------------------------