5241) కనికరముగల తండ్రి కన్నీరు తుడిచితివి

** TELUGU LYRICS **

కనికరముగల తండ్రి కన్నీరు తుడిచితివి
కలనైన కనలేదే కనికరింపబడితినని 
కంటికి కనబడవు చెవులకి వినబడవు
నీ కార్యాలు ఆశ్చర్య క్రియలు దేవా నీకార్యాలు ఆశ్చర్య క్రియలు

ఊహించలేని ఉత్తరమిచ్చి ఊరేగించితివే 
ఊటలను నిచ్చితివే ఉరుము దాగు చోటు నుండి మాట్లాడేదేవా 
ఉన్నత శిఖరముపై నిలిపి ఉజ్జీవపరచితివే
కంటికి కనబడవు చెవులకి వినబడవు 
నీ కార్యాలు ఆశ్చర్యక్రియలు దేవా నీ కార్యాలు ఆశ్చర్యక్రియలు
||కనికరముగల తండ్రి||

మరువ గలనా నీదు మేళ్ళను మరచిపోలేను నీదు కృపలను
మధురమైన అనుభూతి మదినిండా నింపి 
మురిపించితివి మైమరపించితివే
కంటికి కనబడవు చెవులకి వినబడవు 
నీ కార్యాలు ఆశ్చర్యక్రియలు దేవా నీ కార్యాలు ఆశ్చర్యక్రియలు
||కనికరముగల తండ్రి||

బలపరచినావు బలమైన దేవుడవై
భద్రపరచినావు బలహీన సమయములో 
భయమెందుకు నాకు దిగులెందుకు 
బలమైన దుర్గమై నీవు నాకుండగా 
కంటికి కనబడవు చెవులకి వినబడవు 
నీ కార్యాలు ఆశ్చర్యక్రియలు దేవా నీ కార్యాలు ఆశ్చర్యక్రియలు
||కనికరముగల తండ్రి||

** ENGLISH LYRICS **

Kanikaramugala Thandri Kanneeru Thudichithivi
Kalanaina Knaledhe Kanikarimpabadithinani 
Kantiki Kanabadavu Chevulaki Vinabadavu
Nee Kaaryalu Aascharya Kriyalu Deva Neekaaryalu Aascharya Kriyalu

Oohinchaleni Uththaramicchi Ooreginchithive 
Ootalanu Nicchithive Urumu Daagu Chotu Nundi Maatlade Deva 
Unnatha Shikharamupai Nilipi Ujjeevaparachithive
Kantiki Kanabadavu Chevulaki Vinabadavu 
Nee Kaaryalu Aascharyakriyalu Deva Nee Kaaryalu Aascharyakriyalu
||Kanikaramugala Thandri||

Maruva Galanaa Needu Mellaanu Marachipolenu Needu Krupalanu
Madhuramaina Anubhoothi Madininda Nimpi 
Muripinchithivi Maimarapinchithive
Kantiki Kanabadavu Chevulaki Vinabadavu 
Nee Kaaryalu Aascharyakriyalu Deva Nee Kaaryalu Aascharyakriyalu
||Kanikaramugala Thandri||

Balaparachinaavu Balamaina Devudavai
Bhadraparachinaavu Balaheena Samayamulo 
Bhayamenduku Naaku Digulenduku 
Balamaina Durgamai Neevu Naakundagaa 
Kantiki Kanabadavu Chevulaki Vinabadavu 
Nee Kaaryalu Aascharyakriyalu Deva Nee Kaaryalu Aascharyakriyalu
||Kanikaramugala Thandri||

----------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Music : Bro Andrews Garu & JP Ramesh
Tune & Vocals : Nireekshan Bachu & Lillian Christopher
----------------------------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post