4724) నన్ను ప్రేమించిన యేసయ్య నన్ను రక్షించిన యేసయ్య

** TELUGU LYRICS **

నన్ను ప్రేమించిన యేసయ్య 
నన్ను రక్షించిన యేసయ్య (2)
దయ చూపిన నా యేసయ్య 
కరుణించిన నా యేసయ్య (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా 
ఆది అంతము ఉన్న నా యేసయ్య (2)
నీ సేవలో నన్ను నిలిపావయ్యా 
నీకే నా స్తోత్రాలయ్యా (2)
||నన్ను ప్రేమించిన||

మార్గం సత్యం జీవం నీవేనయ్యా 
సత్యస్వరూపివి నీవేనయ్యా (2)
నీ మార్గములో నన్ను నడిపావయ్యా 
నీకే నా స్తోత్రాలయ్యా (2)
||నన్ను ప్రేమించిన||

తల్లి తండ్రి నాకు నీవేనయ్యా 
ఆత్మీయ భందువు నీవేనయ్యా (2)
నీ ఆత్మతో నన్ను నింపావయ్యా
నీకే నా స్తోత్రాలయ్యా (2)
||నన్ను ప్రేమించిన||

-------------------------------------------------------------------
CREDITS : Throne Hosanna, Ft. Jonah Joe
Youtube Link : 👉 Click Here
------------------------------------------------------------------