** TELUGU LYRICS **
ఎటువైపో నీ పయనం
ఎందాకో నీ గమనం (2)
కరిగే కాలం గడిచిన సమయం ఆగదు నీకై ఏ క్షణం
గమ్యం తెలియక తిరిగే లోకం నిలువదు నీకై ఏ దినం
జ్ఞానం ఎరుగక పాపం విడువక కమ్ముకుందిలే మైకం
ఎదో నాడు వదలని కీడు రాల్చుతుంది నీ జీవం
దుష్టుని వలలో చిక్కిన లోకం త్రోవ తప్పిన వైనం
పరిశుధ్ధత నొసగిన క్రీస్తు బాటలో కలదులే నిత్యజీవం
||ఎటువైపో నీ పయనం||

ఊహల తోటలో విహరించే ఈ లోకం
తలపులు చేడినవి పాపముకే దాసోహం
మెరిసే లోకం ఆకర్షణకే నిలయం
లోకపు స్నేహం ప్రభువుతో వైరం నిరతం
మనిషే మృగమై దేవునికే దూరమై
విడిచెను మార్గము..వ్యసనమాయెను పాపము (2)
||దుష్టుని వలలో||
చీకటి బ్రతుకున నువు చేసిన అపరాధం
శిక్షకు ప్రతిగా ప్రభు చేసెను బలియాగం
యేసుని త్యాగం చిందెను రక్తం మనకై
పొందిన గాయం రక్షణ భాగ్యం భువికై
యేసే మార్గము క్రీస్తే సత్యము
ప్రభువే జీవము పరముకు నడిపే వాక్యము (2)
||దుష్టుని వలలో||
--------------------------------------------------
CREDITS : Manikanta Bikkavolu
Youtube Link : 👉 Click Here
--------------------------------------------------