4642) నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా

** TELUGU LYRICS **

నూతనమైన కృపా - నవనూతనమైన కృపా
శాశ్వతమైన కృపా - బహు ఉన్నతమైన కృపా
నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్య
నీ వాత్సల్యమే నాపై చూపించిన
నీ ప్రేమను వివరించనా
నను నీకోసమే ఇల బ్రతికించిన
జీవాధిపతి నీవయ్య
ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయ్యని జ్ఞాపకం (2) 
||నూతనమైన||

నా క్రయధనముకై రుధిరము కార్చితివి
ఫలవంతములైన తోటగా మార్చితివి (2)
ఫలితముకొరకైన శోధన కలిగినను
ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్నివేళలయందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తిర్చగలనా 
||ఇదే కదా||

నీ వశమైయున్న ప్రాణాత్మదేహమునును
పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను (2)
పలు వేదనలలో నీతో నడిపించి 
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తిర్చగలనా 
||ఇదే కదా||

సాక్షిసముహము మేఘమువలె నుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా (2)
వేలాది దూతల ఆనందము చూచి
కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ
మహిమలో నీతోనే నిలచిన వేళ
మాధుర్యలోకాన నిను చూచిన వేళ
ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తిర్చగలనా 
||ఇదే కదా||

--------------------------------------------------------------------------
CREDITS : Hosanna Ministries (హోసన్నా మినిస్ట్రీస్)
Album (34) : Nityatejuda (నిత్యతేజుడా) 
--------------------------------------------------------------------------