4490) యేసు జన్మించెను నింగిలో తార వెలసెను

** TELUGU LYRICS **

యేసు జన్మించెను
నింగిలో తార వెలసెను
పరమున దూతలు 
భువిపై చేరి - పాడి స్తుతియించిరి
సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ
ఆయన కిష్టులకూ భూవిపై సమాధానం కలుగునని 
స్తోత్రగీతాలు పాడిరి - ఈ సువార్తను చాటిరి

లోకాలనేలే రారాజు రిక్తునిగా మారెను
లోకాన్ని వెలిగించిన తేజస్సు చీకటి నే బాపెను
అరుణోదయ దర్శనం నాలో యేసుని జననం
సంతసం సంబరం నాలో కలిగినే పరవశం

మహా మహిమ లో నివాసియై మనిషిగా మారెను
అత్యున్నత సింహాసనం విడిచి పశువుల పాకనే చేరెను 
సర్వోన్నతుని సంకల్పం తండ్రి ప్రేమకు నిదర్శనం 
ఆశ్చర్యం అద్బుతం నాలో పలికెనే స్తోత్రగీతం

** ENGLISH LYRICS **

----------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Moses Yedida
Vocals & Music : Jashua Gariki & Hanok Mutloori
----------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post