** TELUGU LYRICS **
చక్కనైనవాడు - సత్యమైనవాడు
జీవమైనవాడు - మోక్షమైనవాడు
పుట్టినాడండి - బెత్లహేములోన
ఉండినాడండి - ఆ పశులపాకలోన
వెలుగు చూసి కాపరులు - చేరినారండి
గొప్ప చేసి దూతలు - పాడినారండి
చుక్క చూచి జ్ఞానులు - నడిచినారండి
సుతుని వేడి ఎల్లరు - స్తుతించినారండి
సంబరాలు చెసేదం - మనమంతా ఇలలో
క్రీస్తు వార్త చాటేదం - జనమంతా థరిణీలో
||చక్కనైనవాడు||
జీవమైనవాడు - మోక్షమైనవాడు
పుట్టినాడండి - బెత్లహేములోన
ఉండినాడండి - ఆ పశులపాకలోన
వెలుగు చూసి కాపరులు - చేరినారండి
గొప్ప చేసి దూతలు - పాడినారండి
చుక్క చూచి జ్ఞానులు - నడిచినారండి
సుతుని వేడి ఎల్లరు - స్తుతించినారండి
సంబరాలు చెసేదం - మనమంతా ఇలలో
క్రీస్తు వార్త చాటేదం - జనమంతా థరిణీలో
||చక్కనైనవాడు||
చుక్క చెప్పిందిరో - రక్షకుడు పుట్టాడని
దూత చెప్పిందిరో - గొల్లలకు శుభవార్తను (2)
కాపరులు విన్నారు - ఆ జాడ నడిచారు
పాకను చేరారు - ప్రభుని చూచారు
అబ్రాహాము దేముడే - మన దేముడన్నారు
మన గోప్ప కాపరే - రక్షకుడని చాటారు
||సంబరాలు చెసేదం||
తారవెలిసిందిరో - లేఖనాలు సత్యమని
దారి చూపిందిరో - యేసు క్రీస్తే మార్గమని (2)
జ్ఞానులు విన్నారు - బెత్లహేము వెళ్లారు
సత్యమని నమ్మారు - రక్షకుని చుచారు
అద్వితియబాలుడే - పరిశుద్దుడన్నారు
మోక్షమైన నాదుడే - బహుమానమన్నారు
||సంబరాలు చెసేదం||
--------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Gv Reddy
Vocals & Music : Philip Gariki & Ch.Daniel John
--------------------------------------------------------------------------