4588) వందనాలు వందనాలు దేవా నీకే వందనం కోట్లాది స్తోత్రాలకు అర్హుడా వందనం

** TELUGU LYRICS **

వందనాలు వందనాలు దేవా నీకే వందనం
కోట్లాది స్తోత్రాలకు అర్హుడా వందనం (2)
గడచిన కాలమంతా కృపలో మము కాపాడిన
శ్రీ యేసు రాజా నీకే వందనం 
దేవాది దేవా నీకే వందనం (2)

ప్రతి సమయమందు నీ వాత్సల్యత చూపి
సమాధానమిచ్చి దీర్ఘాయుష్షిచ్చినావు (2)
మాయెడల నీకున్న నీ తలంపులు
లెక్కింపజాలని బహువిస్తారములు (2)
శ్రీ యేసు రాజా నీకే వందనం 
దేవాది దేవా నీకే వందనం (2)

ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొను వాడవు
చంక పెట్టుకుని నన్ను రక్షించువాడవు (2)
నీ మాటతో నన్ను బలపరిచినావు
పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచున్నావు (2)
శ్రీ యేసు రాజా నీకే వందనం 
దేవాది దేవా నీకే వందనం (2)

 ** ENGLISH LYRICS **

-------------------------------------------------------
CREDITS : Music : Joseph Henry
Lyrics, Tune, Vocals : Ps. M.Moses
-------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post