** TELUGU LYRICS **
కాలమంత ముందుకింక గడుచుచుండగ
మనసునిండి సంతసం ఉబుకుచున్నది (2)
తిరిగిరాదు గతకాలము
ఆగిపోదు మనకోసము (2)
అనుభవించు ప్రతీనిమిషము
మన యేసురాజు కృపయే చాలును (2)
మనసునిండి సంతసం ఉబుకుచున్నది (2)
తిరిగిరాదు గతకాలము
ఆగిపోదు మనకోసము (2)
అనుభవించు ప్రతీనిమిషము
మన యేసురాజు కృపయే చాలును (2)
పాతబాధ పాతగోల విడిచిపెట్టు మర్చిపో
క్రొత్తయేట క్రొత్తబాట ఎన్నుకొని సాగిపో (2)
యేసునే తలచుకో ప్రతిపూట
నిన్ను ఒంటరిగా ఉంచడు ఏ చోట (2)
అందమైన ఈ ఒక్కజన్మ యేసురాజు దానము
దీర్ఘమైన ఆయుష్కలం పొడిగించే ప్రేమతో (2)
ఇదే నీకు ఆఖరివత్సరమేమో
బహు సిద్ధపడి ఉండు నీ ప్రభుకోసం (2)
నవ్వుతున్న నీ ముఖంపైన బాధలన్నీ చూపకు
ప్రార్ధనందు వాక్యమందు కలుగు నూతనత్వము (2)
పూర్వకాల దీవెనలు తలచుకో
మరి ఎన్నో కలిగేలాగా చూసుకో (2)
---------------------------------------------------
CREDITS :
---------------------------------------------------