** TELUGU LYRICS **
సమ భూమిలో నను నిలిపిన దేవా
సమాజములో నిను స్తుతించెదను (2)
సంతృప్తినిచ్చి క్షేమస్థితిలో నడిపించిన
సమృద్ధినిచ్చి నూతన వసంతము నాకిచ్చిన (2)
సర్వోన్నతుడా ఆరాధనా - సత్య స్వరూపి ఆరాధనా (2)
||సమ భూమిలో||
సమాజములో నిను స్తుతించెదను (2)
సంతృప్తినిచ్చి క్షేమస్థితిలో నడిపించిన
సమృద్ధినిచ్చి నూతన వసంతము నాకిచ్చిన (2)
సర్వోన్నతుడా ఆరాధనా - సత్య స్వరూపి ఆరాధనా (2)
||సమ భూమిలో||
సడలిన నా స్థితిని చూచి సాత్వికముతో బలము నిచ్చితివి (2)
సోలిపోనియ్యక నిలిపితివి సొమ్మసిల్లనీయక తోడుంటివి (2)
సర్వాధికారి ఆరాధనా - సర్వము నీవే ఆరాధనా (2)
||సమ భూమిలో||
సైన్యములకు అధిపతివి నీవు ప్రాకారములను దాటించితివి (2)
సాక్షిగా నన్ను మలచితివి నీ సన్నిధిలో నను నిలిపితివి (2)
సత్యవంతుడా ఆరాధనా - సర్వేశ్వరుడా ఆరాధనా (2)
||సమ భూమిలో||
సిలువ భారం భరియిoచినావు
పాప భారం తొలగించినావు (2)
సంఘములో నన్ను స్థిరపరచి సజీవుడా నాకు స్వాస్థ్యామిచ్చితివి (2)
స్తుతి మహిమలు నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధనా నీకే నయా (2)
||సమ భూమిలో||
-------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics &Tune : Pastor Sundar Paul
Vocal & Music : Pastor Rajesh Garu, Malikipuram & Sareen Imman
-------------------------------------------------------------------------------------------------------